అమ్మ ప‌ల‌క‌నిదే ఆయ‌న ప‌ల‌క‌డు..!


ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో మాటలు చెప్పడంలో , ఆకట్టుకునే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు తర్వాతే ఎవరైనా! ఆయన ప్రధానిని నిందించడానికి చప్రాసీలను వాడుకున్నారు. పార్లమెంటులో మంత్రులు ఎమ్.పిలను అక్కడి ఛప్రాసీలు నమస్తే సర్ అని అంటరు. తాను పోతుంటే మాత్రం జై తెలంగాణ సార్ అంటరు. మీది న్యాయమైన పోరాటం, తప్పక విజయం సాధిస్తారని కూడా ఒక ఛప్రాసి అన్నారని కెసిఆర్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది. అందువల్ల ఛప్రాసికి ఉన్న జ్ఞానం కూడా ప్రధానికి లేదని కెసిఆర్ ధ్వజమెత్తారు.ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. ఎవరైనా మన రాష్ట్రానికి చెందినవారు చప్రాసీలుగా ఉంటే ఆ మాట అనవచ్చేమోకాని, మిగిలినవారికి ఈ విషయం అంతగా పడుతుందా అన్నది సందేహం. అయినప్పట్టికీ, అది జరిగి ఉంటుందన్న అభిప్రాయం కలిగేలా ఉపన్యాసం ఇవ్వడమే ఆయన గొప్పతనంగా చెప్పాలి. అయితే ఇదే సమయంలో మరోవిషయాన్ని ఆయన చెప్పారు.అమ్మ(సోనియా) పలకనిదే ఆయన పలకడు, మన ఖర్మానికి దేశం అలాంటి ప్రదానిని కన్నది అని ఆయన విమర్శించారు. అంటే తెలంగాణ ఇవ్వడం కుదరదని కొంతకాలం క్రితం ప్రధాని చేసిన వ్యాఖ్యల వెనుక సోనియాగాంధీ ఉంటుందన్న విషయాన్ని కూడా తేటతెల్లం చేశారని భావించాలి.ఢిల్లీలో జరిగిన ఒక ధర్నాలో కెసిఆర్ చేసిన ప్రసంగం కధాకమామిషు ఇది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3