కణిమొళికి బెయిలు,కేవలం ఊరటే

 కణిమొళికి బెయిల్ రావడం ఆమె తండ్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్ కి కొంత ఊరటకలిగిస్తే కలిగించిఉండవచ్చు. కానీ బెయిల్ దక్కినంతమాత్రాన 2జి ఉరితాడు మెడమీదనుంచి జారిపోయిందని భావిచనక్కర్లేదు. నిజానికి మొన్న దీపావళినాటికే కణిమొళికి బెయిల్ వస్తుందని పెద్దాయన ఆశించారు. కానీ ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో కణిమొళి కంటతడిపెట్టుకుంది. అయితే, 2జి కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో కస్టడీలోఉన్న నిందితులకు బెయిల్ ఇచ్చినా కీలక సాక్ష్యాలనూ, ఆధారాలను తారుమారుచేసే అవకాశం దాదాపుగా ఉండదు. సీబీఐ ఇప్పటికే దాఖలుపరిచిన అభియోగ పత్రాలు (ఛార్జ్ షీట్) ఆధారంగానే న్యాయస్థానంలో కేసు నడుస్తుంది. బహుశా ఈ కారణంగానే ఇదే కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఐదుగురు కార్పొరేట్ అధికారులకు బెయిల్ మంజూరు చేయడంతో కణిమొళి బెయిల్ కథ సుఖాంతమైఉండవచ్చు.
 అయితే ఇదే కేసులో జైలులో ఉన్న అప్పటి టెలికామ్ శాఖ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురాకు మాత్రం కోర్టు బెయిలు మంజూరు చేయలేదు. 2జి స్పెక్ట్రమ్ కేసులో కనిమొళితోపాటు మరి నలుగురికి కూడా సోమవారంనాడు బెయిల్ లభించింది. బెయిల్ లభించినవారిలో కళైగ్నర్ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్ కూడా ఉన్నారు. ఇంకా కరీం, రాజీవ్ కూడా ఈ కేసులో బెయిలు పొందారు.
 మొత్తానికి ఆరునెలల కస్టడీ కారాగారం నుంచి కణిమొళి బయటపడ్డారు. ఆమెకు బెయిల్ ఇప్పించాలని ఐదుసార్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే ప్రతిసారీ ఎదురుదెబ్బతప్పలేదు.

కణిమొళి మే నెల నుంచి తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. మొత్తం రూ. 200 కోట్ల మేర కుంభకోణం జరిగిన ఈ కేసులో కనిమొళిని జైలు నుంచి విడిపించడానికి అన్నా డి.ఎం.కె. ఎప్పటినుంచో యత్నిస్తున్నది. కనిమొళి ఐదు సార్లు బెయిలు కోసం యత్నించారు. అయితే ప్రతిసారీ ఆమెకు ఎదురుదెబ్బే తగిలింది. సుప్రీమ్ కోర్టు ఇటీవల ఇదే కేసులో ఐదుగురు కార్పొరేట్ అధికారులకు బెయిల్ మంజూరు చేయడంతో కణిమొళి బెయిలుకు మార్గం సుగమమైంది.
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!