ఆంక్షల‌తో ప‌నేముంది..?


ఐశ్వర్యారాయ్ ప్రస‌వానికి సంబంధించిన క‌థ‌నాల‌ను ప్రసారం చేయ‌వ‌ద్దని, ఊహాజ‌నిత‌మైన‌, విశ్లేష‌ణాత్మక‌మైన క‌థ‌నాల జోలికి వెల్లవ‌ద్దని మీడియా వారికి బ్రాడ్‌కాస్ట్ ఎడిట‌ర్స్ త‌మ‌కి తామే కొన్ని ఆంక్షలు విధించుకున్న  విశ‌యం తెలిసిందే. ఐశ్వర్యారాయ్ ప్రస‌వానికి సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా ఆ ఫ్యామిలీనుండి అఫీషియ‌ల్‌గా ప్రక‌టించాకే మీడియాలో రావాల‌ని నిర్ణయించుకున్నారు. కానీ.. ఇలాంటి ఆంక్షలు ఎన్ని విధించుకున్నా.. జ‌ర‌గాల్సిన ప‌ని జ‌రిగిపోతూనే ఉంది.. ఆదివారం నాడు ఐశ్వర్యారాయ్ ముంబ‌య్‌లోని సెవెన్ హిల్స్ హాస్పిట‌ల్‌కి వెళ్ళిన స‌మాచారం తెలియ‌డంతో ఒక్కసారిగా ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఐశ్వర్యారాయ్ ఏ క్షణంలోనైనా ప్రస‌వించ‌వ‌చ్చన న్యూస్‌లు ద‌ర్శన‌మిచ్చాయి.. ఒక‌రు ఆంక్షలు విధిస్తే మీడియాకే ఆంక్షలు విధిస్తారా.. అన్నధోర‌ణిలో ఇలా చేసారంటే ఏదో అనుకోవ‌చ్చు.. కానీ.. త‌మ‌కి తామే ఆంక్షలు విధించుకున్నా కానీ.. దేశ‌వ్యాప్తంగా హాట్ న్యూస్ అయిన‌ ఐశ్వర్య ప్రస‌వం వార్తల‌ని ప్రసారం చేయ‌కుండా ఉండ‌లేక‌పోయారు మీడియావాళ్ళు.. అదీ సంగ‌తి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!