త‌మిళ‌నాడులో డ్యాం999 నిషేధం


వివాదాస్పద ‘డ్యామ్ 999′ చిత్ర ప్రదర్శనపై తమిళనాడు ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతున్న ముల్లై పెరియార్ డ్యామ్‌ను ఆధారంగా చేసుకుని నిర్మించిన హాలీవుడ్ చిత్రం “డ్యామ్ 999″ చిత్రాన్ని విడుదల చేయరాదని, తమ విన్నపాన్ని తోసిపుచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి హెచ్చరించిన విషయం తెలిసిందే.
“డ్యామ్‌ 999″ చిత్రం విడుదల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇరు రాష్ట్రాల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయని ఆయన నిన్న ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్‌ 25వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రాన్ని నిలిపివేయాలని ఇప్పటికే ఎండీఎంకే నేత, వైగో, పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్‌లు కూడా డిమాండ్ చేశారు.
సోహన్ రాయ్ దర్శకత్వంలో బిజ్ టీవీ నెట్‌వర్క్ నిర్మించిన హాలీవుడ్ చిత్రం ‘డ్యామ్ 999’.ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ నెల 25న భారతదేశమంతటా విడుదల చేస్తోంది. ఈ కథ విషయానికొస్తే ‘కథ మొత్తం 1975లో రెండు లక్షల మందికి పైగా ప్రాణాలను బలిగొన్న బాంక్టియా ఆనకట్ట కుప్పకూలిన దుర్ఘటన చుట్టూ తిరుగుతుంది. ఇది నూరేళ్లకు పైబడిన ఆనకట్ట మరియు దాని చుట్టూ ఉన్న జనాభాను దృష్టిలో వుంచుకొని నిర్మించారు. కాలం చెల్లిన ఆనకట్టలు తీసుకవచ్చే విపత్తుల గురించి ఈ చిత్రం అందరికి తెలియజేస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!