కాకరకాయ – మిస్టరీ


కాకరకాయ చేదుగా ఉంటేఉండవచ్చు. కానీ శరీరానికి మేలు చేస్తుందన్న నమ్మకం మనదేశంలో చాలామందిలో ఉంది. షుగర్ వ్యాధికి దివ్యౌషధంగా పనికొస్తుందాలేదా అన్నది తేల్చడం కోసం ఇప్పుడు మూడు దేశాల శాస్త్రవేత్తలు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాకరలోని కెమికల్ మిస్టరీ ఏమిటి అన్నది తెలుసు కుందాం..!

తింటే గారెలేతినాలని అన్నారేగానీ, కాకర తినమని ఎవ్వరూ చెప్పలేదని అనుకుంటున్నారా…? అలా ఫిక్సైపోకండి. ఎందుకంటే, డయాబెటిక్ పేషెంట్స్ కాకర తినాలంటూ శాస్త్రీయంగా చెప్పేరోజు త్వరలో వచ్చేటట్టే ఉంది. ఎందుకంటే, ఈ దిశగా తాజా పరిశోధనలు జోరుజోరుగా సాగిపోతున్ాయి.
మనదేశంలో ఎక్కువగా దొరికే కాకరకాయలోని ఔషధగుణాలపై అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.
షుగర్ వ్యాధికి చేదుమందు ఇస్తారు.. అంటే కాకరకాయ తింటే వ్యాధి తగ్గిపోతుందా? అన్నది తెలుసుకోవ‌డానికి `ప్రాజెక్ట్ బిట్టర్ గార్డ్’పేరిట పరిశోధనలు జ‌రుగుతున్నాయి, త్వర‌లోనే కాక‌ర‌కాయ‌లోని కెమికల్ మిస్టరీని శాస్త్రవేత్తలు  చేధించబోతున్నారు.. దీనికోసం భారత్, టాంజానియా, థాయిలాండ్ దేశాలు సంయుక్తగా కృషి చేస్తున్నాయి.
మనదేశంలో మధుమేహవ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగిపోతోంది. మరీ మఖ్యంగా హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండటంతో ఇక్కడే ఈ ప్రాజెక్ట్ నిర్వహించాలనుకుంటున్నారు. కాకరకాయలోని చేదు మధుమేహం వ్యాధికి విరుగుడని మనదేశంలో చాలామంది నమ్ముతుంటారు. హెర్బల్ వైద్యంలో కాకరకాయది కీలకమైన స్థానమే. ఔషధాల తయారీ కోసం ప్రత్యేకంగా కాకర తోటలు కూడా పెంచుతున్నారు.
అయితే, కాకరకాయల్లో నిజమైన కాకరకాయ వేరయా -అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అవును, వీరు చెప్పేదీ నిజమే. హైబ్రీడ్ కాకరకాయలు వచ్చేసరికి అసలు కాకర పంట తగ్గిపోతోంది. తరతరాలుగా షుగర్ వ్యాధికి ఔషధంగా వాడుతున్న కాకరకాయకీ, నేటి హైబ్రీడ్ కాకరకాయకీ పోలికే లేదు. హైబ్రీడ్ కాకరకాయల్లో చేదు తక్కువగా ఉంటుంది.. అవి వైద్యానికి పనికిరావు.. అఆగే కాకరలో 10 హైబ్రీడ్ రకాలు ఉంటాయి.. వీటిలో కాకుండా కేవ‌లం నాటు కాకరలోనే ధీటైన ఔషధ గుణాలు క‌లిగి ఉంటాయ‌ని నిపుణులు భావిస్తున్నారు.
కారకాయలోని జర్మోప్లాసమ్ ను పరిశీలించి రసాయనాలేమిటో తేలితే అది ఏమేరకు డయాబెటిస్ కు ఔషధంగా పనికొస్తుందన్నది తేల్చిచెప్పొచ్చు. మొమొర్డిసిన్ అనే రసాయనపదార్ధం ఎంత ఎక్కువగా ఉంటే, అంతగా ఔషధ గుణాలు పెరుగుతాయి. కాకారలో అనేక రకాలున్నాయి.  ఏ రెండు రకాలు ఒకే మోస్తరుగా రసాయన పదార్ధాలను కలిగిఉండవు.  ఈ కారణంగానే మధుమేహానికి దివ్యౌషధంగా పనికొచ్చే కాకర ఏమిటో తేల్చాల్సిఉంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే. సో…త్వరలోనే డయాబిటిస్ పేషెంట్స్ మరో శుభవార్త వినబోతున్నారనే అనుకోవాలి.
-ఎన్నార్టీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!