త‌ల‌లు తెగిప‌డినా.. త‌ల‌వంచం..


తెలంగాణ విషయంలో తల తెగినా… తలవంచే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి తప్పా ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వాలకు పట్టవని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం న్యూ డెమోక్రసీ ధర్నా చేపట్టింది. కేసీఆర్, విజయశాంతి, జితేందర్ రెడ్డిలు మద్దతు పలుకుతూ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ప్రభుత్వం తనపై వంద కేసులు పెట్టిందన్నారు. తెలంగాణ ఒప్పందాలను తుంగలోకి తొక్కారని, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఉద్యమం గమ్యానికి చేరుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు దుబాయిలోనే తెల్లరిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ లో తెలంగాణ వాణి వినిపించకుండా కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాలూ బాగుపడతాయన్నారు. తెలంగాణ గురించి అంతా తెలిసినా ప్రధాని మౌనంగా ఉంటున్నారని… ఆయన ప్రధానిగా ఉండటం మన కర్మ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని చూసి పాలకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. పిడికెడు మంది నాయకులు తప్పా రాష్ట్ర విజభనకు అంతా అనుకూలమేనన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!