వార్మీకి (వ‌ర్మ) రామాయ‌ణం ఇదే..!


అయోధ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ దశరధరావు. ఆయన భార్య కౌసల్య. పనిమీద ముంబయ్‌కి వెళ్లిన దశరధరావుకి కైకేయి అగర్వాల్ అనే అమ్మాయి పరిచయమవుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆమెను రెండో వివాహం చేసుకుంటాడు. ఒక బలహీన పరిస్థితుల్లో కైకేయికి పుట్టిన భరత్‌కుమార్‌కే కంపెనీ అప్పజెబుతానని కమిట్ అవుతాడు దశరధరావు. తండ్రి మాటను జవదాటని దశరాధరావు పెద్ద కొడుకు రామ్‌శంకర్.. ఆయోధ్య గ్రూప్ వర్కర్స్ ఎంత బాధ పడుతున్నా తండ్రి వెళ్లమన్న విధంగా తమ కంపెనీకి సంబంధించిన ఒక సిక్‌యూనిట్‌ని నడపడానికి వెళ్లిపోతాడు. అన్నంటే ప్రాణమున్న లక్ష్మణ్ శంకర్ కూడా అన్నను ఫాలో అవుతాడు… ఇదంతా వింటుంటే పాత రామాయణం కథ గుర్తొస్తోంది కదూ?… ఇది రామ్‌గోపాల్‌వర్మ సృష్టించబోతున్న ‘రామాయణం’. ఎప్పుడూ ఏదో ఒక సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచే రాము… ఈ సరికొత్త రామాయణానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
‘‘రామాయణం కథ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఏ కారణం చేత ఎవరు ఈ కథను అంతగా గౌరవించారు. అనే విషయాన్ని చాలాసార్లు విశ్లేషించాను కూడా. ఈ కారణంగానే రామాయణాన్ని నా స్టైయిల్‌లో తీయాలన్న కోరిక కలిగింది. కానీ నా రామాయణం కథ జరిగేది త్రేతాయుగంలో కాదు. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో. హైదరాబాద్‌లో రామాయణంలోని పాత్రలు వుంటే… ఆ రామాయణం ఎలా ఉంటుంది? అనే ఆలోచనలోంచి వచ్చిందే ఈ కథ’’ అని చెప్పారు వర్మ.
బాపు తీసిన ‘శ్రీరామరాజ్యం’ ఇప్పుడు ప్రదర్శితమవుతోన్న సందర్భంలో రాము-ఈ సరికొత్త రామాయణానికి ఆలోచన చేయడం గమనార్హం. ఏమైనా ఈ వర్మ రామాయణం ఎన్ని వివాదాలకు దారితీస్తుందో వేచిచూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!