ఉస్మానియాలో ప‌రిస్థితి ఉద్రిక్తం..


ఉస్మానియాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ ఓయూ జేఏసీ విద్యార్థులు మంగళవారం ఉదయం ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్ పార్క్ వరకూ ర్యాలీగా బయలుదేరారు. అయితే విద్యార్థుల ర్యాలీని పోలీసులు ఎన్ సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. అనంతరం వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన విద్యార్థులు ఆతర్వాత పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!