బ‌ళ్లారిలో ఉపఎన్నిక పోలింగ్‌..


ఓబులాపురం మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి పుణ్య‌మా అని క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది.  బళ్లారి గ్రామీణ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు. ఎన్నిక ల బరిలో ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నా, స్వతంత్ర అభ్యర్థి శ్రీరాములు, బీజేపీ అభ్యర్థి గాదిలింగప్ప, కాంగ్రెస్ అభ్యర్థి రాంప్రసాద్ మధ్యనే హోరాహోరీ పోటీ నెలకుంది. అయితే ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకోడానికి వచ్చే నెల నాలుగో తేదీ వరకు వేచి ఉండాల్సిందే!
పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పోలీసు సిబ్బందితో పాటు పారామిలటరీ దళాలు బళ్లారిలో తిష్టవేశాయి. ఎన్నికకు 2,500 మంది పోలీసులను ప్రపభుత్వం నియమించింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు సమస్యాత్మకమైన 10 ప్రాంతాల్లో కేంద్ర బలగాలనూ మోహరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!