రాజ‌కీయాల్లోకి యువ‌త రావాలి..


యువత రాజకీయాల్లోకి రావాలని ఏఐసిసి అధ్యక్షు రాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన యువజన కాంగ్రెసు సదస్సులో సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనియా, మన్మోహన్ మాట్లాడారు. యువత రాజకీయాల్లో చురుగ్గు ఉండాలన్నారు. అవినీతి నిర్మూలనకే సమాచార హక్కు చట్టం ఉందన్నారు. ప్రజల గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెసు మాత్రమేనని, యువతకు కాంగ్రెసులో ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రజలకు ఉపకారం చేసేది, భారత్ అవసరాలు తీర్చేది కేవలం కాంగ్రెసేనని, ఆ కాంగ్రెసుకు మూలాధారం యూత్ కాంగ్రెసు అన్నారు. కాంగ్రెసుకు ఆశ, శ్వాస కార్యకర్తే అన్నారు. సమగ్ర విధానం తర్వాతే ఎఫ్‌డిఐ రూపకల్పన జరిగిందని ప్రతిపక్షాలు దీనిని అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఎఫ్‌డిఐ వల్ల చిన్న వ్యాపారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఇది రిటైల్ రంగానికి దోహద పడుతుందని, కొత్త చట్టాలు తేవాలని ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. యువ కాంగ్రెసును రాహుల్ పటిష్ట పరిచారన్నారు. ధరలు తగ్గుతాయని తాను ఆశిస్తున్నానని, ద్రవ్యోల్భణ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా సర్జరీ తర్వాత సోనియా మొదటిసారి బహిరంగ సభలో పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!