కోర్టుకు హాజరైన జయలలిత


ఆదాయం కన్నా అక్రమంగా రూ.66 కోట్ల ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత విచారణ నిమిత్తం మంగళవారం బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చ టంతో నేటి విచారణకు తప్పనిసరిగా హాజరు కావల్సి వచ్చింది.  ప్రతిసారి విచారణకు మినహాయింపు పొందుతూ వచ్చిన జయలలిత గత నెల 20,21 తేదీల్లో మొదటిసారి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై 1200 ప్రశ్నల్లో 570 ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చారు. కాగా ఆమె రాక సందర్భంగా పరప్పన అగ్రహార జైల్లోని కోర్టు చుట్టుపక్కల కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

కామెంట్‌లు

  1. ఇంతకు ముందు కూడా ఈమె మీద కేసులు పెట్టారు, తరువాత కొట్టివేశారు. గుడ్డిగుఱ్ఱానికి పళ్ళు తోమడానికి కూడా పనికిరాని ఈ చట్టాలు ఎందుకు?

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!