బాబు ఆస్తులపై ఈడీ విచార‌ణ షురూ


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యం వహిస్తున్న ఎన్.టి.ఆర్.ట్రస్టు తో సహా కొందరికి నోటీసులు జారీ అయ్యాయి. దీనితో చంద్రబాబుతో పాటు మిగిలినవారిపై కూడా విచారణ ఆరంభమైనట్లే. సుప్రింకోర్టు లో స్టే కోసం సి.ఎమ్.రమేష్ , సుజనా చౌదరి లు ఇప్పటికే దరఖాస్తు చేశారు . ఈ లోగా విచారణ మొదలు కావడంతో ఇది ఏ రూపం దాల్చుతుందన్నది ఆసక్తికరమైన పరిణామంగా ఉంది.అందులోను ఎన్ఫోర్స్ మెంట్ విభాగం ముందుగా నోటీసుల జారీ చేయడం విశేషం. విదేశీ లావాదేవీల గురించి, గత మూడేళ్ల వివరాలు ఇవ్వాలని కూడా ఇడి నోటీసులో కోరారు. స్వయంగాగాని, ప్రతినిధులను పంపి గాని విచారణకు హాజరు కావాలని ఇడి కోరింది. ఢి్ల్లీ నుంచి ప్రత్యేక బృందం వచ్చి మరీ విచారణ ఆరంభించింది. చంద్రబాబు తోపాటు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, రాజ్యసభ సభ్యుడు వై.ఎస్.చౌదరి తదితరులు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!