111… మీకు మీరే మెజీషియన్
11.11.11 సృష్టిస్తున్న సంచలనం అంతాఇంతాకాదు. అంకెల గారడీలతో భవిష్య దర్శనాలతో టీవీఛానెళ్లు ఉదయం నుంచీ హోరెత్తిపోయాయి. న్యూమరాల జిస్టులనూ, జ్యోతిషపండితుల్నీ కూర్చోపెట్టి గంటలతరబడి చర్చకార్యక్రమాలు లాగించేశారు. ఈ హడావుడికి తోడుగా ఎస్ఎంఎస్ ల వేవ్ వచ్చేసింది. 111 వచ్చేలా మ్యాజిక్ చేసేయొచ్చంటూ సెల్ ఫోన్లలోకి సంక్షిప్త సందేశాలు వచ్చిపడ్డాయి. ఈ సందేశాల సారాంశం ఏమిటంటే…
1. ముందుగా మీరు పుట్టిన సంవత్సరంలోని చివరి అంకెలు ఒ పక్కన వేసుకోవాలి. (ఉదాహరణకు మీరు 1986లో పుట్టారనుకోండి , అప్పడు 86 అంకె పక్కన వేసుకోవాలి)
2. మీ వయసు, ఇప్పటికి కంప్లీట్ అయిన సంవత్సరాలు ఎన్నో ఆ సంఖ్య దాని కింద వేసుకోవాలి. అంటే మీ వయసు 25 సంవత్సరాలు పూర్తయితే, ఆ సంఖ్య వేసుకోవాలి.
3. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా, ఈ రెండు అంకెల్నీ కూడేయడమే.
4. ఆశ్చర్యమేసిందా… మొత్తం కూడితే 111 వచ్చేసింది కదూ… ఇదే మ్యాజిక్. ఇలా ఎవరైనా ట్రై చేయవచ్చు.
5. చివరిగా మరో మాట…ఇలాంటి పరిస్థితి రావాలంటే, అంటే, ఇలాంటి మ్యాజిక్ మీరు చేయాలంటే 823 సంవత్సరాలు ఆగాల్సిందే.
- ఎన్నార్టీ
98852 922028
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి