జ‌న‌మే బ‌లం అంటున్న జ‌గ‌న్‌


వైఎస్ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా తనను వదలి ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ లోకి వెళుతున్నారన్న విషయాన్ని అంగీకరిస్తున్నట్లుగా ఉంది.శాసనసభ్యులు తన వెంట లేకపో యినా జగమంతా కుటుంబం తన వెంట ఉందని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్రలో ఆయన ప్రసం గాలలోఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. జగన్ వెంట సుమారు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇంతకాలం ఉన్నారు. వారిని తిరిగి కాంగ్రెస్ లోకి లాక్కోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది మెల్లగా వెనక్కి వస్తున్నారు. పదహాను నుంచి పద్దెనిమిది మంది కాంగ్రెస్ లోకి రావడానికి సిద్దంగా ఉన్నారని ,ఇప్పటికే కొద్దిమంది కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఉదాహరణకు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ముఖ్యమంత్రి కిరణ్ తో పాటు రచ్చబండలో పాల్గొనడమే కాకుండా ఆయనను బాగా పొగిడారు. ఇలా కొంతమంది తమ వైఖరిని మార్చుకుంటున్నారు. అంతేకాక రాజీనామాల విషయంలో కూడా వెనక్కి తగ్గుతున్నారు. ఈ నేపధ్యంలోనే తన వెంట ప్రజలు ఉన్నారని జగన్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా రెండున్నర ఏళ్లపాటు అధికారం ఉన్న సమయంలో కాంగ్రెస్ ను వదలి దూరంగా ఉండడం వల్ల వచ్చే చిక్కులను దృష్టిలో ఉంచుకుని వీరు జారుకుంటున్నారు. అయితే ఒకవేళ నిజంగానే అవిశ్వాస తీర్మానం వస్తే అప్పుడు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంటుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ తరచూ టిడిపి ని దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాలు చేస్తుంటుంది. కాని టిడిపి అందుకు సిద్దంగా లేకపోవడం కాంగ్రెస్ కు కలిసి వస్తోంది. దాంతో జగన్ వర్గం ఎమ్మెల్యేలు కూడా వెనక్కి తగ్గుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!