40@ వాణీ జ‌య‌రాం..


వాణీజ‌య‌రాం.. నేప‌థ్య‌గాయ‌ణిగా ఆమె 40 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్నారు. హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ త‌దిత‌ర 18 భాష‌ల్లో ఆమె పాడిన పాట‌లు ఎన్నో.. త‌న మ‌ధుర‌మైన గొంతుతో నాలుగు ద‌శాబ్దాల పాటు ప్రేక్ష‌కుల‌ని మైమ‌ర‌పింప‌జేసిన వాణీ జ‌య‌రాంని సంగమ్ అకాడమీ సంస్థ లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనుంది. ఇంతవరకూ 18 భాషల్లో పదివేలకు పైగా పాటలు ఆమె పాడారు. మూడు సార్లు జాతీయ స్థాయిలో ఆమె ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకోగా అందులో రెండు తెలుగు (శంకరాభరణం, స్వాతిముత్యం) చిత్రాలు ఉండటం విశేషం. తన రెండో ఏట నుంచే సంగీతంలోని రాగాలను గుర్తుపట్టగలిగిన వాణీజయరాం 1971లో హిందీ చిత్రం ‘గుడ్డీ’తో పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆమె తొలి తెలుగు చిత్రం ‘అభిమానవంతులు’(1973). అనేకసార్లు వివిధ రాష్ట్రప్రభుత్వాలచే ఉత్తమ గాయనిగా అవార్డులను, తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైమామణి’ అవార్డు పొందారు. ఈ నెల 26న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే సత్కార కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని సంగమ్ అకాడమీ అధ్యక్షుడు సంజయ్‌కిశోర్ తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!