య‌జుర్వేద మందిరం సంప‌ద‌పై పోలీసుల దృష్టి




భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సోదరుడి తనయుడు రత్నాకర్, మరో ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్‌ల చుట్టు ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తోంది. సత్యసాయి బాబా నివశించిన యజుర్ మందిరం నుండి డబ్బులు రవాణా అవుతున్నట్టు బయట పడటమే కాకుండా సాయి బంధువులు ట్రస్టు సభ్యులపై ఆరోపణలు గుప్పించారు. దీంతో ట్రస్టు సభ్యులు ఇరుకున పడుతున్నారు. బాబా మృతి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తున్న బాబా సమీప బంధువులు ఒక్కొక్కొరు గళం విప్పుతున్నారు. ట్రస్ట్ వర్గాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్‌పై వస్తున్న ఆరోపణలు, అనుమానాలను నివృత్తి చేయకపోగా సత్యసాయిబాబాకు ఆపాదిస్తూ ట్రస్ట్‌వర్గాలు వ్యవహరిస్తుండడాన్ని కూడా బంధువర్గాలు తప్పుపడుతున్నాయి. యజుర్మందిరం నుంచి అక్రమంగా తరలిన సొమ్ముపై పోలీసు వర్గాలు తీగలాగుతున్నాయి.
యజుర్మందిరం నుంచి ఎంతెంత డబ్బు ఎప్పుడు తరలిపోయిందనే విషయాన్ని కూపీ లాగుతున్నారు. ప్రధాన్‌ను బయటికి తీసుకురావడానికి ట్రస్ట్‌లోని కొందరు సభ్యులు కేంద్రమంత్రుల స్థాయిలో పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు పట్టుబడ్డ డబ్బులతో తమకు సంబంధం లేదని రత్నాకర్ చెప్పి ఆ దిశగా నిరూపించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు అంతా తాము చెప్పినట్లే జరుగుతుందని ఊహించిన ట్ర స్ట్ సభ్యులకు ఒకవైపు బంధువర్గాలు, మరోవైపు పోలీసులు ఝులక్ ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనేక అవకతవకలు వెలుగు చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యజుర్మందిరం నుంచి అక్రమంగా తరలుతున్న సత్యసాయి సంపద వ్యవహారంలో ట్రస్ట్ సభ్యులు ఆర్‌జే.రత్నాకర్, శ్రీనివాసన్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేసారు.
ఈ వ్యవహారంపై ప్రశాంతినిలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రధాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో ట్రస్ట్‌కు సంబంధించిన ముఖ్యుల పేర్లు వెలుగు చూసినట్లు  తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టు చేసిన సుహాన్‌శెట్టి శిష్యుడు సదాశివ, శ్రీనివాసన్ పర్సనల్ సెక్రటరీ వెంకటేష్‌లను కూడా విచారించడానికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు ఉన్నతాధికారులనుంచి పోలీసులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
స‌త్య‌సాయి ఆరోగ్యం విష‌మించిన‌ప్ప‌టి నుండి ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌శాంతి నిల‌యం నుండి విలువైన సంప‌ద త‌ర‌లిపోతోంద‌న్న‌ది రుజువైతే.. స‌త్య‌సాయి ట్ర‌స్టుని ప్ర‌భుత్వం త‌న ఆధీనంలోకి తీసుకోవ‌డం మంచిది.. లేదంటే స‌త్య‌సాయిబాబా ఏర్పర‌చిన ఆ ఆధ్యాత్మ‌కి స‌మ్రాజ్యం మొత్తం అభాసుపాల‌వ‌డం ఖాయం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!