ఐశ్వర్య తల్లికాబోతోంది..!
ప్రఖ్యాత నటి, అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్యర్యారాయ్ తల్లి కాబోతున్నారు.ఈ విషయాన్ని సూపర్ స్టార్, అభిషేక్ తండ్రి అయిన అమిఆబచ్చన్ సంబరంగా చెబుతున్నారు. తాను తాతను కాబోతున్నానన్న ఆనందాన్ని ఆయన అందరితో పంచుకుంటున్నారు. ట్విట్టర్ లో అమితాబ్ ఈ విషయాన్ని ప్రకటించి తాను ఎంతో సంతోషంగానే ఉన్నానని ఆయన చెప్పారు. రెండువేల ఏడులో అభిషేక్, ఐశ్యర్యల వివాహం ఘనంగా జరిగింది. అయితే ఐశ్యర్య రాయ్ ఈ విషయాన్ని వెల్లడించలేదు. కాని తాత అవుతున్నానన్న ఉత్సాహంలో అమితాబచ్చన్ బయటపెట్టేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి