ఫైటింగ్స్ ఉంటే పార్టీ స్ట్రాంగ్‌గా ఉన్న‌ట్టే..!



కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాలలో జరుగుతున్న గొడవలపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు,.ఎవరికి వారు పార్టీని వారు తమ సొంతదిగా భావించి దాని ప్రగతికి పని చేస్తున్నారని,ఈ పోటీలో ఇలాంటి వివాదాలు సహజమేనని కొత్త భాష్యం చెప్పారు.పార్టీ పటిష్టంగా ఉండ బట్టే గొడవలు జరుగు తున్నాయని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పార్టీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలి కొట్టుకున్నారు. కుర్చీలు విసురుకోవడం, ఘర్షణ పడడం, అరుపులు తోపులాటలతో కాకినాడ డిసిసి ఆఫీస్ గందరగోళంగా మారింది. దానికి కారణం ఏమిటంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ వేణు కొద్దిరోజులు కాంగ్రెస్ కు రాజీనామా చేసి, తిరిగి వెనక్కి వచ్చారు. దానిపై ఆయన వ్యతిరేక వర్గీయులు వేణు క్షమాపణ చెప్పి సమావేశాన్ని ఆరంభిం చాలని డిమాండు చేశారు. కొన్ని రోజుల క్రితం జరిగిన సమావేశంలో కూడా ఇదే గొడవ జరిగింది. మళ్లీ అదే తరహాలో రెండు రోజుల క్రితం కూడా వివాదం ఏర్పడింది. దీంతో డిసిసి మీటింగుకు వచ్చిన మంత్రులు తోట నరసింహం, విశ్వరూప్ లు,కొందరు ఎమ్మెల్యేలు సమావేశం హాలు నుంచి నిష్క్రమిం చారు.ఈ నేపధ్యంలో బొత్స సత్యనారాయణ దీనిపై స్పందిస్తూ, పార్టీలో ఒకరిని మించి ఒకరు పోటీపడుతు న్నందున ఈ వివాదాలు వస్తున్నాయని వ్యాఖ్యానించడం విశేషం.ఈ గొడవలను అంత సీరియస్ గా తీసు కోనవసరం లేదని కూడా తేల్చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!