మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సేఫ్‌



మౌంట్ కైలాష్ లో చిక్కుకుని పోయిన మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ బృందం సురక్షిత ప్రదేశానికి చేరుకున్నారని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణరావు వెల్లడించారు. రక్షణ శాఖ మంత్రి ఎ.కె.ఆంటోనితో తాను మాట్టాడానని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుని మంత్రి కన్నా బృందాన్ని ఇబ్బంది లేకుండా తీసుకువస్తామని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బృందం అక్కడికి దగ్గరగా ఉన్న ఒక ఇంటికి చేరారని దాసరి తెలిపారు. వీరి విషయమై ప్రధాని కార్యాలయానికి సమాచారం తెలిపామన్నారు. కాగా మంత్రి కన్నా బంధువులు కూడా సదరన్ ట్రావెల్ సంస్థ ఎదుట ధర్నా చేశారు. కాగా అవంతి శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక మాట్లాడుతూ తమ తండ్రి, కన్నా బృందానికి ఇంకా ఆశ్రయం దొరికినట్లు సమాచారం అందలేదని చెప్పారు. సదరన్ ట్రావెల్ సంస్థ సరిగా పనిచేయడం లేదని, సమన్వయంగా పనిచేయడం లేదని, ఆహారం కూడా లేదని, ఈ విషయం తన తండ్రి శ్రీనివాసరావు కూడా చెప్పారని ఆమె అన్నారు.అయతే దాసరి చెప్పినదాని ప్రకారం కూడా ఈ రాత్రికి మాత్రం అక్కడే ఆశ్రయం పొందితే, సోమవారం ఉదయం రాగలుగుతారు. కాగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి రేపు మంత్రి బృందాన్ని ఢిల్లీ తీసుకు రావచ్చని చెబుతున్నారు. చైనా , టిబిట్ సరిహద్దులో , గడ్డకట్టే చలిలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బృందం యాతనలు పడుతున్న సమాచారం టీవీలలో ఎప్పటికప్పుడు ప్రసారం అవుతుండడంతో సంబంధిత అధికారవర్గాలు చొరవ తీసుకోవడం ఆరంభించాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!