అజాద్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా..?


కేంద్రంలో హోం మంత్రి బాద్యతలనుంచి చిదంబరం ను తప్పిస్తారా? కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అనేక మార్పులు,చేర్పులు చోటు చేసుకుంటాయని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.ప్రత్యేకించి హోం మంత్రి చిదంబరం ను ఆ శాఖ నుంచి తప్పించవచ్చని, కొత్త హోం శాఖ మంత్రిగా గులాం నబీ అజాద్ ను నియమించవచ్చని కదనాలు వస్తున్నాయి. అయితే మరో కధనం ప్రకారం కీలకమైన వ్యక్తుల శాఖలె వ్వరీ మారబోవని చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రిగాఅజాద్ ను నియమించడంలో ఒక ప్రత్యేకత ఉందని, ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఇలాంటి సమయంలో ఆయనకు హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తే మరింత ప్రయోజనం ఉంటుందన్నది కొందరి వాదన. అలాగే కాశ్మీర్ లో ఉగ్రవాద సమస్య ఇటీవలికాలంలో తగ్గుముఖం పట్టడం కూడా కాస్త ఆశాజనక వాతావరణంగా ఉంది. దానిని మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి అజాద్ ఉపయోగపడవచ్చు. చత్తీస్ గడ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో ఉన్న నక్సల్స్ సమస్య తీవ్రతను తగ్గించడానికి కూడా అజాద్ సేవలను వాడుకోవాలన్నది పార్టీ ఉద్దేశంగా చెబుతున్నారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటివాటిలో, కొన్ని కార్పొరేట్ కంపెనీలకు చిదంబరం అనుకూలంగా ఉంటారన్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని కూడా మార్పులు చేర్పులు చేయవచ్చన్న కధనాలు వస్తున్నాయి. కాగా అసలు అజాద్ సేవలన్నిటిని పార్టీకి ఉపయోగించు కోవాలని,ఆంధ్రప్రదేశ్ తో సహా నాలుగైదు రాష్ట్రాల బాధ్యతలను ఆయనకు అప్పగించి పార్టీ పరిస్థితిని మెరు గుపర్చాలని పార్టీ వర్గాలు వాదిస్తున్నాయని అంటున్నారు.ఒక వేళ చిదంబరం ను హోం శాఖ నుంచి మార్చితే విదేశీ వ్యవహారాల శాఖ అప్పగించవ్చన్న ప్రచారం జరుగుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!