చిరంజీవికి మంత్రి ప‌ద‌వి ద‌క్కునా..?

ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవికి కాంగ్రెసులో ఉన్నత స్థానం లభిస్తుందని ఆశించారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని కూడా భావించారు. అయితే, మంత్రి పదవి కోసం కొంత కాలం ఆగాల్సిందేనని ఎఐసిసి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పదవి కోసం అక్టోబర్ దాకా ఆగాల్సిందే నని చెబుతున్నారు. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికీ చోటు లభించకపోవచ్చునని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతోందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిర్ధరిం చారు. బుధవారం తన నివాసంలో సంపాదకుల బృందంతో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. తెలంగాణ, వైయస్ జగన్‌ను నిలువరించడం అనే రెండు అంశాలపై దృష్టి పెట్టినందున రాష్ట్రం నుంచి ఇప్పుడు ఎవరినీ మంత్రివర్గంలోకి తీసుకోకపోవడమే మంచిదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
పునర్వ్య వస్థీకరణ ఎప్పటిలోగా పూర్తవుతుందని ప్రశ్నించినప్పుడు ”నేను ఊహించలేను” అని సమాధానమి చ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో జులై నెల లోనే  పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని సంపాదకులు భావిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పు లు ఉండవని కూడా చెబుతున్నారు. ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ఒకటి కంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వారికి భారం తగ్గించి, వారి అదనపు శాఖకు కొత్తగా మంత్రిని నియమిస్తారని చెబుతున్నారు. ఏఐసీసీ వర్గాలు మాత్రం మంత్రివర్గం నుంచి కొందరిని తొలగించవచ్చని అంటున్నాయి.
మంత్రిపదవి కోల్పోయే వారిలో డి.కె.హండిక్‌, మురళీదేవ్‌రా, కాంతిలాల్‌ భూరియాలు ఉండొచ్చని చెబుతున్నాయి. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారిస్తారని భావిస్తున్నారు. మంత్రిగా స్వతంత్ర బాధ్యతలు నిర్వహిస్తున్న బేణీ ప్రసార్‌ వర్మకు పూర్తిస్థాయి కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి లభించే అవకాశం ఉంది. అలాగే సినీనటుడు రాజ్‌బబ్బర్‌కు తొలిసారి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కవచ్చంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!