అన‌ర్హ‌త నిర్ణ‌యం పై స్పీక‌ర్ దృష్టి..


శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ అనర్హత నోటీసులు అందుకున్న టిడిపి, పిఆర్పీ, కాంగ్రెసు శాసనసభ్యుల వాదనలు వినేందుకు సన్నద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఇప్పటికే టిడిపి అసంతృప్త శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, ప్రజారాజ్యానికి చెందిన శోభా నాగిరెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, శ్రీకాంతరెడ్డి, అమర్నాథ్ రెడ్డిపై ఆయా పార్టీలు స్పీకర్‌కు అనర్హత పిటిషన్లు ఇచ్చాయి. టిడిపి అసంతృప్త ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తన పిటిషన్‌కు సమాధానాలు చెప్పారు. మిగిలినవారికి సంబంధించి నోటీసులకు సమాధానాలు ఇవ్వడం వరకూ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇటీవలె స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన మనోహర్ ఈ అంశంపై మరింద దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రెండు రోజుల క్రితం మంత్రివర్గ సమావేశంలో ఈ దిశలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!