సాయిబాబా వీలునామా రాయలేదు

సత్యసాయి బాబా ప్రత్యేకంగా వీలునామా ఏమీ రాయలేదని సత్యసాయి బాబా ట్రస్టు సభ్యులు స్పష్టం చేశారు. బాబాకు సంబందించి ఎలాంటి వీలునామా లేదని , తమకైతే అలాంటి వీలునామా ఉన్నట్లు మా దృష్టికి రాలేదని ట్రస్టు తరపున మీడియాతో మాట్లాడిన నాగానంద్ చెప్పారు. అయితే కొందరు తమకు బాబా వీలునామా తమకు తెలుసనో, లేక, బాబా తమకు చెప్పారనో కొందరు కొన్ని విషయాలను చెబుతున్నారని, కాని వాటి ఆధారంగా ట్రస్టు పనిచేయజాలదని, వాటిని పరిగణనలోకి తీసుకోలేమని ఆయన చెప్పారు.
అయితే ,ఎవరైనా ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో బాగంగా సలహాలు ఇవ్వవచ్చని, అవి ఆమోదయోగ్యం అయితే అమలు చేయవచ్చని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యులుగా ఉన్నవారంతా చాలా పెద్దవారని, జస్టిస్ భగవతి సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ గా చేసినవారని, ఎస్.వి.గిరి ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా పనిచేశారని, ఇలా ఆయా రంగాలకు సంబందించిన విశిష్ట వ్యక్తులు ఇందులో ఉన్నారని,వీరిలో ఎవరూ ఒక్క పైసా కూడా ట్రస్టు డబ్బు తీసుకోరని, సొంత ఖర్చుతో పనిచేస్తున్నారని నాగానంద్ తెలిపారు.సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి డైరెక్టర పదవికి డాక్టర్ సఫయా రాజీనామా చేయలేదని, ఆయన ఇప్పుడు ఎనభై ఏళ్ల వయసులో ఉన్నారని, విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారని ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!