వైఎస్ ఆర్ పార్టీలోకి అనంత‌పురం నాయ‌కులు..


అనంతపురం జిల్లాలో రాజకీయాలలో మార్పు వస్తోంది. జగన్ నేటి నుంచి ఓదార్పు యాత్రను ఈ జిల్లాలో చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రముఖ రాజకీయ కుటుంబాలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నాయి.తాడిపత్రిలో ఇంతకాలం మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డికి ప్రత్యర్ధులుగా ఉంటూ వచ్చిన తెలుగుదేశం నేత పేరం నాగిరెడ్డి సోదరులు అమరనాధరెడ్డి, మహేశ్వరరరెడ్డిలు తెలుగుదేశం పార్టీని వదలి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు.అయితే పేరం నాగిరెడ్డి టిడిపిలోనే ఉంటారా? లేక ఆయన కూడా తర్వాత కాలంలో చేరతారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక నల్లమడ నియోజకవర్గం (పునర్విభజనకు ముందు ఉండేది) మాజీ ఎమ్మెల్యే కె.మోహన్ రెడ్డి కూడా జగన్ కు మద్దతు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇప్పటికే అనంతపురం జిల్లా ఫరిషత్ చైర్ పర్సన్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. కాగా ఎమ్మెల్యేలు గురునాధరెడ్డి, రామచంద్రారెడ్డిలు కూడా జగన్ మద్దతుదారులుగా గుర్తింపు పొందారు. జిల్లా సామాజిక సమీకరణాల రీత్యా కూడా రెడ్డి నాయకులు ఎక్కువమంది కాంగ్రెస్ ను వదలి జగన్ పార్టీలో చేరుతున్నట్లు కనబడుతుంది.అయితే ఇప్పుడు టిడిపిలో ఉన్న అదే వర్గ నాయకులు కూడా జగన్ వైపు వెళ్లడం ఆసక్తికర పరిణామం.అనంతపురం జిల్లాలో రెడ్డి, కమ్మ వర్గాల మధ్య రాజకీయ ఘర్షణ చాలాకాలంగా ఉంది.మరి ఇప్పుడు అది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిడిపిలకు మధ్య మారుతుందా అన్నది చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!