గ్యాస్ ధర తగ్గిస్తాం-బొత్స


పెరిగిన వంట గ్యాస్ ధరలో కొంత రాష్ట్రప్రభుత్వం భరించడానికి సిద్దమవుతోంది.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాము గ్యాస్ ధర లో రాయితీ ఇవ్వాలని కోరామని అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.డీజిల్, కిరోసిన్, గ్యాస్ ధరల పెంపు అనివార్యమని, అయితే రాష్ట్రాలు తమ పన్నులను కొంత తగ్గించుకోవాలని , తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా రాష్ట్రాలను కోరారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆ రాష్ట్రంలో సెస్ ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.మొదట రాష్ట్రంలో ఈ ధరలు తగ్గించడం కుదరదని అన్నారు. కాని ఆ తర్వాత ఒత్తిడి పెరిగిన నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణలు అదికారులతో చర్చించారు. ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు రిలీఫ్ ఇచ్చేలా చేయాలని భావించారు. తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు బొత్స వెల్లడించారు.కాగా ఆర్టీసి ఛార్జీలు సామాన్య ప్రయాణికులపై బారం పెడకుండా చూస్తామని, పల్లెవెలుగు బస్ లకు ఛార్జీలు పెంచబోమని ఆయన అన్నారు.లక్జరీ బస్ ల ఛార్జీలు పెరుగుతాయిని బొత్స తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!