నో నీడ్ పాలిటిక్స్‌


అని అంటున్నారు డిజిపిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర‌వింద‌రావు..  తాను రాజకీయాలలోకి రాబోనని గురువారం పదవీ విరమణ చేసిన పోలీస్ డైరెక్టర్ జనరల్ కె.అరవిందరావు చెప్పారు.అయితే పోలీసు శాఖకు తన సేవలు అందించడానికి సదా సిద్దంగా ఉంటానని ఆయన అన్నారు. కరణం కుటుంబంలో పుట్టిన తనను అదే వృత్తిలో చేరాలని కుటుంబ సభ్యులు కోరేవారని, కాని తాను ఎమ్.ఎ. చదవడంతో ఫ్రొఫెసర్ కావాలని అనుకున్నానని, కాని ఒక లెక్చరర్ సలహాతో ఐఎ ఎస్,ఐపిఎస్ పరీక్షలకు తయారయ్యి రాశానని , అందులో ఎంపిక అయ్యాయని అన్నారు. రాజశేఖరరెడ్డి దగ్గర పనిచేయడం గురించి అడిగితే, తెల్లవారు జామున రమ్మనడం వంటివి ఆయన దగ్గర లేదని, ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వెళితే సరిపోయేదని, ఆయన కంఫర్ట్ బుల్ గా ఉండి, తమను కంఫర్ట్ గా ఉంచేవారని, ఆయన తన పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లే అనిపిచే దని ఆయన చెప్పారు.ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులలో ఉద్రిక్త వాతావరణం ఏమీ లేదని మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తున్నదని, అక్కడ గ్రామాలలో ఎవరూ ఇబ్బంది పడడం లేదని అరవిందరావు అన్నారు. తుపాకి తో రాజ్యం వస్తుందనుకోవడం సరికాదని ఆయన చెప్పారు.ముప్పైనాలుగేళ్లపాటు పోలీసు శాఖకు సేవలం దించిన అరవిందరావును చత్తీస్ గడ్ రాష్ట్రంలో నక్సల్స్ సమస్యను అంతం చేయడానికి సలహాదారుగా తీసు కోవచ్చని చెబుతున్నారు.కొందరు డిజిపిలు రిటైరయ్యాక రాజీకీయాలలోకి వచ్చారు. కాని అంతగా రాణించలేకపోయారు.ఉదాహరణకు పేర్వారం రాములు డిజిపిగా పనిచేసి ఆ తర్వాత ఎపిపిఎస్ సి ఛైర్మన్ గా కొంత కాలం ఉన్నారు. తర్వాత టిడిపిలో చేరినా పెద్దగా రాణించలేదు. మరో డిజిపి స్వరణ్ జిత్ సేన్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేదు కాని సోనియాగాంధీ కుటుంబంతో ఉన్నఅనుబంధం రీత్యా ఈశాన్య రాష్ట్రా లకు సంబంధించి భద్రత సలహాదారుగా పదవి సంపాదించుకున్నారు. అంతకుముందు మరో డిజిపి పి.ఎస్. రామ్మోహనరావు లాబియింగ్ చేసుకుని తమిళనాడు గవర్నర్ పదవి తెచ్చుకున్నారు .కాని పూర్తికాలం ఉండలేకపోయారు.మొత్త మీద రాష్ట్ర ప్రభుత్వంలో మిగిలిన పదవులకన్నా డిజిపి పదవి చేసినవారికి ఇతర అవకాశాలు హెచ్చుగానే ఉంటాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!