గవర్నర్ కాన్వాయి ప్రమాదం-తప్పెవరిది



ప్రభుత్వ ప్రముఖులకు, ఇతర ప్రముఖులకు ఐదు , అంతకన్నా మించి వాహనాలతో కాన్వాయి ఉంటుంది. వి.ఐ.పి.ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కాన్వాయిలను ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, జిల్లాలకు వెళ్లినప్పుడు మంత్రులకు కాన్వాయిలు ఉంటాయి. కొందరు నేతలు ప్రైవేటు గా భారీ కాన్వాయిలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. కాని వారి కోసం రోడ్ ట్రాఫిక్ అంతటిని నిలిపివేసి ఎక్కడా ఇబ్బందిలేకుండా చేస్తారు. దీంతో వాహనాలు వాయువేగంతో వెళుతుంటాయి. అలాంటప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దానికి కారణం ఏమిటంటే, ఈ వాహనాలు పోటీపడి పరుగులు తీస్తుంటాయి. కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కాన్వాయికి ప్రమాదంజరిగింది. అలాగే ఆయా ప్రముఖుల కాన్వాయిలకు ప్రమాదాలు జరిగిన ఘటనలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. రోడ్ క్లియర్ గా ఉండడంతో అతివేగంగా వెళ్లడం వల్ల ఒకదానిని ఒకటి అందుకోవడానికి వాహనాల డ్రైవర్లు పోటీపడుతున్న సందర్బంలో ఒక్కోసారి అదుపు తప్పి బోల్తా పడడమో, లేక స్తంభాలను ఢీకొట్టడమో, లేక మనుషులను ప్రమాదాలకు గురిచేయడమో జరుగుతోంది. గవర్నర్ నరసింహన్ కాన్వాయి కూడా ఇలాంటి సందర్భంలోనే ప్రమాదానికి గురి అయింది.ఆయన ఉన్న కారు నూటపది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళుతుంటే, దానిని అందుకుని దాని వెనుకే వెళ్తడం కోసం టాటాసుమో ను వేగంగా నడపడంకోసం డ్రైవర్ చేసిన యత్నంలో అదుపు తప్పి స్థంభాన్ని ఢీకొట్టి డ్రైవరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నరసింహన్ బాగా స్పందించారు. ఆయన స్వయంగా దగ్గరుండి వారందరిని ఆస్పత్రికి తరలించి , వాకబ్ చేయించడం అంతవరకు బాగానే ఉంది.కాని అసలు ఇంత స్పీడ్ గా వెళ్లకుండానే విఐపిలు ఆదేశాలు ఇచ్చి నియంత్రిస్తే చాలావరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇలాంటి ప్రమాదాలలో విఐపిలు కూడా ప్రాణాలు కోల్పోయిన అనుభవాలు ఉన్నాయి. ఉదాహరణకు మాజీ మంత్రి ఇంద్రారెడ్డి, అంతకుముందు రాజారాం వంటివారు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. కనుక విఐపిలు వాహనాలు అతి వేగంగా వెళుతున్నప్పుడు వారే నియంత్రిచడం మంచిది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!