ఓ మై డాడీ…ఇటీజ్ యువర్స్ డే


మాతృదేవోభవ…
పిత్రుదేవోభవ…
ఆచార్యదేవోభవ…
అన్న సంస్కృతి మనది.

ఫాదర్స్ డే, మదర్స్ డే… అంటూ మనదేశంలో పురాతన కాలం నుంచీ జరుపుకోకపోయినా, అమ్మానాన్నలను దేవతలుగా భావిస్తూ ప్రతినిత్యం పూజించే ఘనమైన దేశం మనది. అమ్మ ప్రేమ నిండుగా చవిచూడాలన్నా, తండ్రి అనురాగాన్నీ మనసారా పంచుకోవాలన్నా అది మనదేశంలోనే సాధ్యమవుతోంది. అయితే, ఈ మధ్యకాలంలో ప్రాశ్చాత్య సంస్కృతి మనదేశంలో కూడా పరవళ్లు తొక్కుతుండటంతో మదర్స్ డేలూ, ఫాదర్స్ డేలూ వచ్చిపడ్డాయి. తల్లిదండ్రులను పూజించే పర్వదినంగా భావించే ఫాదర్స్ డే ఆశయాన్ని తప్పుపట్టలేం. ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొన్ని ఆసక్తికరమైన అంశాలను అందజేస్తున్నాం…
ఫాదర్స్ డే ని ప్రతి ఇంటా ఓ శుభదినంగా జరుపుకునే రోజు వచ్చేసింది.  జూన్ మూడో ఆదివారం అనగానే ఫాదర్స్ డే గుర్తుకురాకమానదు. పిల్లలు మొదట నేర్చే మాట అమ్మా…అనే, అయితే, ఆ తర్వాత అంతగా అభిమానంతో పిలుచుకునే మరో పదం…నాన్న. అందుకే, దేశం ఏదైనా, మతం ఏదైనా, ఆచారవ్యవహారాలు ఎలా ఉన్నా, తల్లిదండ్రులను గౌరవించడంలో భిన్నాభిప్రాయం లేనేలేదు.
పిల్లలకు ఊహతెలిసి, రెక్కలొచ్చేదాకా ప్రతి ఇంట్లో తల్లిదండ్రులే వారికి హీరోహీరోయిన్లు. అమ్మానాన్నల తెలివితేటలు చూసి వారెంతో మురిసిపోతుంటారు. మగపిల్లవాడు నాన్నను, ఆడపిల్ల అమ్మను కాపీకొట్టాలని చూస్తుంటారు.
ఫాదర్స్ డే జరుపుకోవడం, తండ్రితో అనురాగబంధనాన్ని పెనవేసుకోవడం మంచిదే. అయితే, చిత్రమైన విషయం ఏమంటే, పాదర్స్ డే అన్నిదేశాల్లో ఒకే రోజున జరుపుకోవడంలేదు.
ఎక్కువ దేశాల్లో జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటున్నప్పటికీ, మిగతా దేశాల్లో వేరే డేట్స్ లో జరుపుకుంటున్నారు.
ఇండియా సహా అనేక దేశాల్లో జూన్ మూడో ఆదివారమే ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు.
జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటున్న దేశాలు…
- అమెరికా
- ఇంగ్లండ్
- ఇండియా
- కెనడా
- చైనా
- ఫాన్స్
- గ్రీస్
- హాంగ్ కాంగ్
- పాకిస్తాన్
- సింగపూర్
- సౌతాఫ్రికా
- శ్రీలంక
- స్విట్జర్లాండ్
- ఇంకా మరికొన్ని…
ఈ ఏడాదికి ఇప్పటికే ఫాదర్స్ డే జరుపుకున్న దేశాలు…
- టర్కీ, రష్యా : ఫిబ్రవరి 23
- ఇటలీ, స్పెయిన్ : మార్చి 19
- జర్మనీ : జూన్ 2
ఈ ఏడాది ద్వితీయార్థంలో ఫాదర్స్ డే జరుపుకునే దేశాలు…
- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్: సెప్టెంబర్ 4
- నార్వే, స్వీడన్, ఐస్ లాండ్, ఫిన్ లాండ్: నవంబర్ 6
- థాయిలాండ్: డిసెంబర్ 5
నాన్నల కోసం ఓ రోజు కేటాయించడంలో ప్రపంచదేశాన్నీ ఒకటే అయినా, ఫాదర్స్ డే ల్లో మాత్రం ఏకత్వంలో భిన్నత్వమేమో…

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!