సామూహిక స్నానాల రికార్డు..!
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఎంతకైనా తెగించేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు.. తాజాగా ‘వరల్డ్ స్కిన్నీ డిప్పింగ్’ రికార్డు కోసం 400 మంది స్ర్తీ, పురుషులు కలిసి ఏ మాత్రం సిగ్గు పడ(లే)కుండా వంటి మీద నూలు పోగు లేకుండా సముద్రపు నీటిలో గంతులేశారు. నగ్నంగా సామూహిక స్నానాలు చేసి రికార్డు నెలకొల్పారు. ఇంతకు ముందు 240 మంది స్ర్తీ, పురుషులు నగ్నస్నాన మాచరించి నెలకొల్పిన రికార్డును వీళ్లు తిరగరాసారన్న మాట.. దీనికి వారు పెట్టుకున్న ముద్దు పేరు ‘వరల్డ్ స్కిన్నీ డిప్పింగ్.. ప్రపంచం నలుమూలల నుండి ఇందులో పాల్గొనడానికి ఉత్సాహవంతులు ఈ కార్యక్రమ వేదిక అయిన సౌత్ వేల్స్ చేరుకొని గౌవెర్ రోస్సీలీ బీచ్‌లో ఈ రికార్డు నెలకొల్పారు. మన ఇండియాలో అయితే సామూహిక వివాహాలు జరుగుతాయి కానీ.. ఇలా సామూహిక స్నానాలు అనేటివి ఉంటాయా.. అసలలాంటి ఆలోచనైనా వస్తుందా..? వెయ్యి వేయితలలు అనడానికి ఇలాంటి సంఘటనలు ఉదాహరణలుగా నిలుస్తుంటాయి.. అయితే.. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. వీరు ఇలా రికార్డు నెలకొల్పింది.. తమ స్వప్రయోజనం కోసం కాదు.. నేషనల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకి సహాయం చేయడానికి ఈ ప్రోగ్రాం ద్వారా 20 వేల డాలర్లు సమీకరించి ఆ ట్రస్ట్‌కి అందివ్వడానికి వారు ఈ కార్యక్రమాన్ని నెలకొల్పారు.. ఆశయం బాగానే ఉన్నప్పటికీ.. మరీ ఇంత నగ్నంగానా…?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి