స‌త్య‌సాయి ట్ర‌స్ట్‌ నుండి భారీ న‌గ‌దు త‌ర‌లింపు..


పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి బాబా మ‌ర‌ణం త‌ర్వాత స‌త్య‌సాయి ట్ర‌స్ట్ నిర్వ‌హ‌ణ‌పై ఒక్క‌సారిగా అనుమానం రేకెత్తింది. ట్ర‌స్ట్‌లో ఎన్నో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌న్న‌ది ఇప్పుడు బ‌హిరంగ ర‌హ‌స్యం.. స‌త్య‌సాయి ట్ర‌స్ట్ కి సంబంధించిన నిధులు ట్ర‌స్ట్ స‌భ్యుల ఖాతాల్లోకి మ‌ళ్లుతున్నాయ‌ని, ఆ నిధులు దుర్వినియోగం అవుతున్నాయ‌ని మీడియా కోడైకూస్తున్నా ప్ర‌భుత్వం ఏమీ ప‌ట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తుంది. తాజాగా య‌జుర్వేద మందిరంలో కోట్ల రూపాయ‌ల సంప‌ద ఉంద‌న్న ఊహాగానాల‌కు తెర‌దింపి అందులో కేవ‌లం ముఫ్ఫై నాలుగు కోట్ల రూపాయ‌ల సంప‌ద మాత్ర‌మే ఉంద‌ని ట్రస్ట్ స‌భ్యులు ప్ర‌క‌టించ‌డం తెలిసిందే.. అయితే వారు చెప్పిన‌ట్టు అందులో ఉన్న కోట్లాది సంప‌ద ర‌హస్యంగా బ‌య‌టికి త‌రిలిపోయింద‌ని అంద‌రూ అనుమానిస్తున్నారు.. ఆ అనుమానాన్ని బ‌ల‌ప‌రుస్తూ గ‌త రాత్రి స‌త్య‌సాయి ట్ర‌స్ట్‌కి సంబంధించిన వాహ‌నంలో 35 కోట్ల రూపాయ‌లు బెంగుళూరుకు త‌ర‌లిస్తుండగా పోలీసుల‌కి చిక్క‌డం సంచ‌ల‌నం క‌లిగించింది.. వివ‌రాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా హిందూపురం టోల్ గేట్ వద్ద సత్యసాయి ట్రస్టు వాహనం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంచలనం కలిగించే ఈ ఘటన ఇప్పుడు అనేక అనుమానాలకు అవకాశం ఇస్తుంది. ఆ డబ్బును బెంగుళూరు పంపుతున్నామని ట్రస్టువారు చెప్పే అవకాశం ఉంటుంది. అయితే దానిని ధృవీకరించే విధంగా ట్రస్టు వారు ఆధారాలు చూపితే ఫర్వాలేదు .కాని అలా కాని పక్షంలో ఎన్నో అనుమానాలు బయల్దేరతాయి. ఇప్పటికే ట్రస్టుకు సంబంధించి కొందరిపై అనేక వ్యతిరేక కధనాలు వచ్చాయి. సాయిబాబా ఆస్పత్రిలో ఉన్నప్పుడు
ట్రస్టు నుంచి విలువైన వస్తువులు ,నగదు భారీగా తరలించారని ఆరోపణలు విస్తృతంగా వచ్చాయి. కాని అప్పుడు ట్రస్టు ఖండించింది. తాజాగా యజుర్వేద మందిరాన్ని తెరచి ఆ గదిలో ఉన్నడబ్బును, బంగారం, వెండిని లెక్కించినప్పటికీ, పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. విలువైన వజ్రాలు ఉండాలని వాటి గురించి లెక్క చెప్పలేదంటూ ఆరోపణలు వచ్చాయి. మాజీ ఎమ్.పి ఆదికేశవులు నాయుడు అయితే ఏకంగా సత్యజిత్ పై ఆరోపణలు గుప్పిస్తూ,డబ్బు మాయం అవడానికే అతనే కారకుడని అన్నారు. ఈ నేపధ్యంలో హిందుపూర్ టోల్ గేట్ వద్ద ఇరవై ఐదు లక్షల రూపాయలు పట్టుబడడం సంచలనం అవుతుంది. దీనిపై ట్రస్టు వర్గాలు ఎలాంటి వివరణ ఇస్తాయో చూడాలి.వారి వివరణ సంతృప్తిగా లేకపోతే అది ట్రస్టు పనితీరుపై సంశయాలు రేకిత్తిస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!