సుప్రీంకోర్టులోనూ క‌నిమొళికి చుక్కెదురు..!


డిఎమ్ కె అధినేత్రి కరుణానిది కుమార్తె కనిమొళి బెయిల్ పిటిషన్ ను సుప్రింకోర్టు తిరస్కరించింది. ఛార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత కిందికోర్టులో అప్లై చేసుకోవచ్చని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి షరతులనైనా పాటిస్తానని, తనకు చిన్న పిల్లవాడు ఉన్నాడని, మహిళనని కనిమొళి చేసిన వాదనను సుప్రింకోర్టు తోపిపుచ్చింది. 2జి స్పెక్ట్రమ్ కేసులో అనేకమంది నిందితులు ఉన్నందున ఇలా బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.అత్యున్నత న్యాయస్థానం కూడా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో డిఎమ్.కె నాయకులు హతాశులయ్యారు. సిబిఐ చేసిన వాదనతో అన్ని కోర్టులు ఏకీభవించినట్లయింది. కనిమొళి లేదా ఇతర నిందితులు బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంటుందన్నది సిబిఐ వాదించింది. ఏది ఏమైనా కనిమొళి మరికొంతకాలం తీహారు జైలులోనే కొనసాగవలసి వస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!