మళ్లీ కాంగ్రెస్ గూటికి ముద్రగడ

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని కదనాలు వస్తున్నాయి.ఆయన ఈ మధ్యవరకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు సన్నిహితంగా మెలిగారు. జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు ముద్రగడ కూడా వెన్నంటే ఉన్నారు.కాని ఆ తర్వాత పరిణామాలలో ముద్రగడ పద్మనాభం క్రమేపి జగన్ కు దూరం అయ్యారు.
ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ను జగన్ తన శిబిరంలోకి తీసుకోవడంపై ముద్రగడ అసంతృప్తి చెందారు.అలాగే మరోనేత జ్యోతుల నెహ్రూను పార్టీలో తీసుకున్నప్పుడు కూడా అసంతృప్తి చెందారు కాని, దొరబాబు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఆయన ఇక లాభం లేదని అనుకున్నారు.
ఈ పరిస్థితులలలో కేంద్ర మంత్రి పల్లంరాజు మెల్లగా పావులు కదుపుతూ ముద్రగడను కాంగ్రెస్ లోకి తీసుకు రావడానికి యత్నిస్తున్నారని అంటున్నారు. ఆయన కోరుకున్న చోట ఆయన లేదా, ముద్రగడ కుమారుడు గిరి పోటీచేసే విధంగా అవగాహన కుదుర్చుకోవచ్చని అంటున్నారు.కాగా ముద్రగడ ఇప్పటివరకు అనేక పార్టీలను చూసిన వ్యక్తిగా పేరొందారు. జనతా పార్టీతో ఆయన రాజకీయ జీవితం ఆరంబమైంది, ఆ తర్వాత తెలుగుదేశం లో మంత్రి అయ్యారు. తదుపరి సొంతంగా పార్టీ పెట్టడానికి ప్రయత్నంచేశారు.తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళి మంత్రిగా కొద్ది కాలం ఉన్నారు.
ఆ మీదట ఆయన భారతీయ జనతాపార్టీలో ప్రవేశించారు. తదనంతరం తెలుగుదేశంలోకి వచ్చారు. ఎమ్.పి అయ్యారు. మెల్లగా ఆ పార్టీకి దూరం అయి కాంగ్రెస్ లో చేరారు.గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ మద్దతుదారుడయ్యారు. కాని అక్కడ కూడా ఉండలేక మళ్లీ కాంగ్రెస్ లో పునఃప్రవేశం చేయవచ్చని అంటున్నారు. ముద్రగడ రాజకీయజీవితం ఏ విదంగా మలుపుతిరుగుతుందో..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!