ప్రశాంతి నిలయం మిస్టరీ ని చేధించేది ఎవరు ???


ప్రశాంతి నిలయం కార్య కలాపాలపై  మొదటి నుంచి సందేహాలే.. బాబా మరణం ఇంకా మిస్టరీ  ఇక ప్రశాంతి నిలయం నుంచి సొమ్ము, ఆభరణాలు తరలి పోవడం, మరో మిస్టరీ సొమ్ము , బంగారం  తరలి పోతుందని   మీడియా కోడై కూసినా ఎవరుపట్టించుకోరు , ఇదొక మిస్టరీ బాబా చని పోక ముందు చనిపోయిన తర్వాత ఇంకెంత సొమ్ము గల్లంతు అయిందో ఆ దేవుడికే తెలియాలి . అసలు  యజుర్వేద మందిరం లో ఎందుకు దాచారనేది సమాధానం లేని ప్రశ్న. భక్తులు వివిధ కార్యక్రమాల కోసం ఇచ్చిన సొమ్మును బ్యాంకు లో జమ చేయాలి గదా?? శనివారం నాకాబందీలో దొరికిన రూ.35 లక్షలు ట్రస్టుకు చెందినవే అని అనంతపురం జిల్లా ఎస్పీ చెబుతుంటే ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని రత్నాకర్ ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ డబ్బు మాది కాదు’ అని చెప్పేందుకు ట్రస్టుకు 24 గంటలు ఎందుకు పట్టింది? ఆ సొమ్ముకు 12 మంది సొంతదారులున్నారని చెప్పిన  రత్నాకర్… వారి పేర్లు ఎందుకు  బయట పెట్టలేదు?  ఆ సొమ్ము ఎవరిదో ఆయనకు ఎలా తెలుసు? నిజంగా ఆ డబ్బు ఎవరిదో అయితే… వారు ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ డ్రైవర్ చేత ఎందుకు తరలిస్తారు?  అంతా  మిస్టరీయే .  ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోదు? ప్రశాంతి నిలయం వాటికన్ సిటీలా ప్రత్యేక దేశమా? అది రాజ్యాంగానికి, చట్టాలకు అతీతమా? ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ట్రస్టు సభ్యుల ఆస్తులపై ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడంలేదు? సేవా కార్యక్రమాల కోసం బాబాకు భక్తులిచ్చిన కోట్లాది రూపాయలు పక్క దారి పడుతుంటే సర్కార్ నుంచి స్పందనేది ?? అసలు ప్రభుత్వం ఎందుకు పట్టనట్టు ఉంటోంది ?? సర్కార్ ను ఎవరైనా పక్క దారి పట్టిస్తున్నారా?? అదే నిజ మైతే ఎవరు వారు ? ఈ సందేహలన్నింటికి సమాధానాలు రావాలంటే నిష్పాక్షిక విచారణ జరగాల్సిందే ! అలాంటి విచారణ కోసం భక్తులే డిమాండ్ చేయాలి .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!