రాందేవ్ ట్రస్టుకు సుప్రీం నోటీసులు


బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ స్వాభిమాన్ ట్రస్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ పై కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దీక్షా భగ్నం పేరుతో పోలీసులు లాఠీచార్జీ చేశారని ముందుగా ఢిల్లీ పోలీసులకు కోర్టు నోటీసులు పంపింది. అయితే దీనిపై పోలీసులు సమాధానంగా.. రాంలీలా మైదాన్ లో రాందేవ్ యోగా కోసం మాత్రమే అనుమతి తీసుకున్నారని కోర్టుకు తెలిపింది. కేవలం 5 వేల మందికి అనుమతి ఉంటే ఏకంగా 65 వేల మందిని తరలించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు.. రాందేవ్ ట్రస్టుకు నోటీసులు జారీచేసింది. రాంలీలా మైదాన్ లో అనుమతి లేకుండా ఎందుకు దీక్ష చేశారో సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 11 కి వాయిదా వేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!