ఎన్.టి.ఆర్ తెలంగాణకు అన్యాయం చేశారా?


ఉద్రేకాలు వస్తే ఎవరు ఏమి చేస్తారో చెప్పజాలం.తెలంగాణ సిద్దాంతకర్త ఫ్రొఫెసర్ జయశంకర్ కు నివాళి అర్పించడానికి వెళ్లిన లోక్ సభ సభ్యులు రాజయ్య, వివేక్, మంత్రులు శంకరరావు, పొన్నాల లక్ష్మయ్యలపై కొంతమంది దాడిచేశారు. దాంతో జయశంకర్ కు శ్రధ్దాంజలి ఘటించడానికి ముఖ్యనేతలు ఎవ్వరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అది మంచిదా? కాదా అన్నది కాదు. అలాగే నాయకులు తప్పుచేశారా? లేదా? అన్నది కాదు.కాని సందర్భం ముఖ్యం. రాజకీయాలలో ఉన్న నేతలు అవకాశవాదంగా ఉండవచ్చు. కాని ఎంత సంక్షోభ పరిస్థితి వచ్చినా, ఆయన ఎంత ప్రశాంతంగా ఉండేవారో గుర్తు తెచ్చుకొని మసలాలి. నిజమే నాయకులు మోసాలకు పాల్పడుతున్నారు. దానికి నిరసన చెప్పే హక్కు అందరికి ఉంటుంది. వ్యతిరేక నినాదాలు చేయవచ్చు. నిరసన తెలపవచ్చు. కాని దాడులు చేయడం, రాళ్లు వేయడం వంటివి ప్రజాస్వామ్యంలో సరైన విధానం అనిపించుకోదు. తాత్కాలికంగా ఉపయోగపడుతుందేమో కాని దీర్ఘకాలికంగా నష్టం చేస్తుంది.ఇక జయశంకర్ అంతిమయాత్రను పురస్కరించుకుని ఎన్.టి.ఆర్. విగ్రహాలపై కొందరు టిఆర్ఎస్ నేతలు రాళ్లు వేశారని కధనాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కె.చంద్రశేఖరరావు స్వయంగా ఎన్.టి.ఆర్ వల్ల రాజకీయాలలో రాణించగలిగారు.అప్పుడు రాజకీయాలు వేరు, పరిస్థితులు వేరు.అలాగే ఎన్.టి.ఆర్. హయాంలోనే జయశంకర్ కాకతీయ వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు.జయశంకర్ ను ఎన్.టి.ఆర్ గౌరవించారు. ఇప్పుడు ఎన్.టిఆ.ర్ లేరు.ఆ రోజులలో ఎన్.టి.ఆర్ పట్ల వరంగల్ జిల్లా ప్రజలు విపరీతమైన ఆదరణ చూపారు.మరి ఇప్పుడు ఆయన అన్యాయం చేశారని అనుకోవాలా?కాకపోతే ప్రస్తుతం పరిస్థితులు మారినంతమాత్రాన దివంగతులైన నేతల విగ్రహాలపై రాళ్లు వేయడం, చెప్పులు వేయడం వంటివి అభిలషణీయం అవుతాయా!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!