డ‌బ్బు త‌ర‌లింపులో కేంద్ర‌, రాష్ట్ర మంత్రుల హ‌స్తం ఉన్న‌దా..?


సత్యసాయి ట్రస్టు వ్యవహారం మరోసారి వివాదంలో పడడంతో రాజకీయంగా కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో కేంద్ర హోం మంత్రి చిదంబరంపై విమర్శలు కురిపించిన శాసనమండలిలో విపక్ష నాయకుడు దాడి వీరభద్రరావు మళ్లీ ధ్వజమెత్తారు. సాయి ట్రస్టు వ్యవహారాలు అంత గందరోళంగా మారితే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్ఇర కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి వల్ల జాతీయంగా, అంతర్జాతీయంగా దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు. హిందుపూర్ చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డ ముప్పై ఐదు లక్షల రూపాయలు ట్రస్టువేనని తేలిన తర్వాత కూడా ట్రస్టు సభ్యలు రత్నాకర్, శ్రీనివాసన్ లను ఎందుకు అరెస్టుచేయలేదని దాడి ప్రశ్నించారు. ఈ నిధుల తరలింపు వెనుక కేంద్ర మంత్రి కుమారుడి హస్తం ఉందని, అలాగే రాష్ట్ర మంత్రి ఒకరి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. యజుర్వేద మందిరం నుంచి కేవలం నామమాత్రంగా పదకుండు కోట్ల రూపాయలు చూపారని, మిగిలిన సొమ్ము అంతా ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆయన ఆరోపించారు. సాయిబాబా ఆస్పత్రిలో చేరినప్పటినుంచే యజుర్వేద మందిరం నుంచి డబ్బు, బంగారం, వజ్రాలు వంటి విలువైనవి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపణలు వచ్చినా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రేక్షకపాత్ర వహించారని ఆయన విమర్శించారు. మొత్తం మీద సాయి ట్రస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియాపరంగా ఉందన్న విమర్శలు బాగా పెరుగుతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!