ప‌వ‌న్ షాడో కాదు.. కాళీ..!



ప‌వ‌న్‌క‌ళ్యాన్ తాజా చిత్రం టైటిల్ మారింది.. ఇంత‌వ‌ర‌కూ ఈ చిత్రానికి షాడోగా టైటిల్ ఖ‌రార‌యింద‌ని భావించారు. అయితే ఎందుకో ఆ పేరుని తీసేసి కాళీగా టైటిల్ మార్చార‌ని తెలుస్తోంది. నెల రోజుల నుండి క‌ల‌క‌త్తాలో నిర్విరామంగా ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. త‌మిళ డైరెక్ట‌ర్ విష్ణువ‌ర్ధ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాని స్టైలిష్‌గా రూపొందిస్తాడ‌ని ద‌ర్శ‌కుడు విష్ణువ‌ర్థ‌న్‌కి మంచి పేరుంది. తెలుగులో మొద‌టిసారిగానే స్టార్ హీరో ప‌వ‌న్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం రావ‌డం, ఈ చిత్రంలో ప‌వ‌న్‌ని స్టైలిష్‌గా చూపించ‌డానికి విష్ణ‌వుర్థ‌న్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయ‌న అనుకున్న‌ట్టుగానే ప‌వ‌న్ స్టైలిష్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్టు ఈ చిత్రం స్టిల్స్ చూస్తుంటే తెలుస్తోంది. లైట్ గ‌డ్డంతో ఇంత‌కు ముందు చిత్రాల‌కి భిన్నంగా న్యూలుక్ ఇచ్చేలా ప‌వ‌న్ జాగ్ర‌త్త తీసుకుంటున్నాడు. ఇంత‌కుముందు క‌ల‌క‌త్తా బ్యాక్‌డ్రాప్‌తో వ‌చ్చిన ఖుషీ చిత్రం ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే.. అదే సెంటిమెంటుతో ఈ చిత్రాన్ని క‌ల‌క‌త్తాలో షూటింగ్ చేస్తున్నారు.. మ‌రి ఈ కాళీ చిత్రం ఖుషీ చిత్రం మాదిరిగా సంచ‌ల‌నం సృష్టిస్తుందా..?  లేదా.. అన్న‌ది వేచి చూడాల్సిందే..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!