ఎమ్మెల్యే విష్ణు తెలంగాణ మ‌ద్ద‌తు వెనుక‌..?



హైదరాబాద్ నగరంలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. జూబ్లి హిల్స్ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధనరెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ తో మున్ముందు రాజకీయంగా ఘర్షణ పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విష్ణు పార్టీ పరంగా ఎవరూ వంటా, వార్పు కార్యక్రమంలో పాల్గొననప్పికీ ఆయన స్వయంగా పాల్గొని తెలంగాణ కు మద్దతు ఇచ్చారు. అవసరమైతే తెలంగాణ సాధనకోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు.పార్టీలకు అతీతంగా తెలంగాణ సాధనకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. తన తండ్రి కూడా తెలంగాణ సాధనకు కృషి చేశారని చెప్పారు. కాగా మంత్రి దానం నాగేందర్ వంటవార్పు వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రజలు ప్రశాంత జీవనాన్ని కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒత్తిడి రాజకీయాలు చేయడం వల్ల కూడా ఉపయోగం ఉండదని నాగేందర్ పేర్కొనడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదట నుంచి నాగేందర్, మరో మంత్రి ముకేష్ వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ తెలంగాణ ఇచ్చేటట్లయితే హైదరాబాద్ ప్రత్యేకంగా రాష్ట్రం గా ఉండాలని వారు డిమాండు చేశారు. ఆ తర్వాత ఒత్తిడి పెరిగి తాను కూడా తెలంగాణకు అనుకూలమని నాగేందర్ ఒక్కరు మాత్రం తెలిపారు. కాని కొద్ది రోజుల క్రితం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్ర చేసినప్పుడు వీరిద్దరూ వెళ్లలేదు.
అయితే విష్ణు వర్దన్ రెడ్డి కి కూడా ఈ విషయంలో పెద్ద తేడా ఉండకపోవచ్చు కాని,దానం నాగేందర్ మీద వ్యతిరేకతతో ఈయన తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.పైగా ఈ మధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తనపట్ల అంత సానుకూల దృక్ఫదంతో లేరన్న భావన తో కూడా ఈయన తెలంగాణ వైపు ఆకర్షితులై ఉంటారని చెబుతున్నారు.మొత్తం మీద హైదరాబాదులో తెలంగాణకు సంబంధించి ఈ మాత్రం క్రియాశీలకంగా ఉన్న ఎమ్మెల్యే విష్ణునే అవుతారు. ఇది సహజంగానే తెలంగాణవాదులకు సంతోషం కలిగించే విషయమే అవుతుంది. అయితే కాంగ్రెస్ లో మాత్రం ఇది కొత్త సమీకరణలకు దారి తీసే అంశమే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!