విశాల్‌కి కూడా న‌టించ‌డం వ‌చ్చా..?



తెలుగువాడైన తమిళ హీరో విశాల్ ఇంతకాలం యాక్షన్ సినిమాలతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి సినిమాల్లో నటుడిగా తన ప్రతిభ చాటుకునే అవకాశం లేకపోవడంతో విశాల్ కేవలం కండలు, ఫైట్లు నమ్ముకుని నెట్టుకొచ్చేశాడు. అయితే బాలా దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చేసరికి విశాల్ సంతోషం పట్టలేకపోయాడు.. తనలోని నటుడిని బాలా ఆవిష్కరించాడని విశాల్ చెబుతూ ఉంటే నటన గురించి ఇతను మాట్లాడుతున్నాడేంటి’ అని నవ్వుకున్న జనమే నోళ్లు తెరిచేలా ‘వాడు వీడు’లో అద్భుతమైన నటన కనబరిచాడు. సూర్య అతిథి పాత్ర పోషించిన ఈ చిత్రంలో సూర్య ఎదురుగా నవరసాలు అభినయించే సన్నివేశంలో అయితే విశాల్ నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. కేవలం ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే కాదు, అదే సమయంలో క్యారెక్టర్ కి అనుగుణంగా మెల్లకన్ను కూడా పెట్టాల్సి ఉండగా, ఎక్కడా లోపం లేకుండా నటించాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!