సాక్షిపై టిడిపి ఫోక‌స్‌..


వైఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత ప‌త్రిక సాక్షి, సాక్షి టివిలో టిడిపి పై బ్లాక్‌మెయిలింగ్ న్యూస్ ప్ర‌సార‌మ‌ వుతుండ‌టం, కాంగ్రెస్‌తో టిడిపి చేతులు క‌లిపింద‌న్న‌ట్టుగా బ‌ల‌మైన వార్త‌ల‌ను త‌యారు చేసి ప్ర‌సారం చేయ‌డం, ప్ర‌చురించ‌డం తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్న‌ట్టు ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. కేవ‌లం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ పార్టీని దెబ్బ‌తీసే క‌థ‌నాల‌ను రూపొందించ‌డంలో సాక్షి టీం నిరంత‌రాయం కృషి చేస్తుండ‌టంతో చంద్ర‌బాబు సాక్షిపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. సాక్షిని ధీటుగా ఎదుర్కొనేందుకు చంద్రబాబు సరికొత్త వ్యూహాన్ని రచించినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం జరిగిన సమావేశంలో చంద్రబాబుతో పాటు పలువురు సీనియర్ నేతలు సాక్షి టిడిపిని లక్ష్యంగా చేసుకున్న విషయంపై చర్చించారు. దాదాపు అంద‌రు నేత‌లు సాక్షి తీరుపై అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంతో చంద్ర‌బాబు ఓ స‌రికొత్త ప్లాన్‌ని రూపొందించారు.  పార్టీ ఇరుకున పడడానికి అవకాశం గల సందర్భాల తో పాటు, ఇతరత్రా అవసరమైన సమయాల్లో తమ వాగ్ధాటితో మీడియాలో ధీటుగా మాట్లాడే నేతలను గుర్తించడంతో పాటు అవసరాన్ని బట్టి వారికి తగిన శిక్షణ కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో దాడి వీరభద్రరావు, రేవంత్ రెడ్డి తదితరులు ఉన్నట్టుగా తెలుస్తోంది. టీవీ ఛానళ్లు నిర్వహించే చర్చలలో పాల్గొనడం తో పాటు, పత్రికలకు ఇంటర్వూలు ఇచ్చే సందర్భాల్లో నాయకుల కు ఈ కమిటీ తగిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ విధంగా సాక్షిలో వ‌చ్చే క‌థ‌నాల‌పై ప్ర‌త్య‌క్ష దాడి చేస్తూ త‌మ‌కి అనుకూల‌మైన ఫ‌లితాల‌ని పొందేందుకు టిడిపి తీవ్రంగా కృషి చేస్తుంది. ఒక‌ప్పుడు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఆయ‌న‌పై ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిల‌లో వ్య‌తిరేక క‌థ‌నాలు వ‌చ్చిన సంద‌ర్భాల‌లో ప్ర‌త్య‌క్షంగానే ఆయ‌న ఆ రెండు ప‌త్రిక‌లు టిడిపి క‌ర‌ప‌త్రాలంటూ విమ‌ర్శ చేయ‌డం తెలిసిందే.. ఇప్పుడు చంద్ర‌బాబు సాక్షిని జ‌గ‌న్ పార్టీ క‌ర‌ప‌త్రంగా అభివ‌ర్ణించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేదు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!