రాహుల్ ప్ర‌ధాని కాబోతున్నాడా..?



ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడు.. లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ.. 40వ పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఆయ‌న క‌టౌట్ల‌తో, ఆయ‌న అభిమానుల‌తో రాహుల్‌గాంధీ నివాసం నిండిపోయింది. అయితే నిన్న రాహుల్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని దిగ్విజ‌య్ సింగ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని బ‌ట్టి రాహుల్‌గాంధీ త్వ‌ర‌లో ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారా..? అన్న అనుమానం రాక మాన‌దు.. దీనికి కార‌ణం..  ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే.. ఉత్తమ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారని ప్రజలు అభిప్రాయపడుతున్నారని.. ఓ సర్వే వెల్లడించింది. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరు మీద లెన్ఫ్ ఆన్ న్యూస్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ నిర్వహించిన ఈ సర్వే విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మారాలని 61 శాతం మంది కోరుతున్నారు. కేవలం 34 శాతం మంది మాత్రమే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావాలని.. కోరుకున్నారు. అదే సమయంలో 46 శాతం మంది ప్రధాని మన్మోహన్ కన్నా రాహులే బెటరని.. తేల్చారు. గత ఏడెనిమిదేళ్లుగా పార్టీ కోసం రాహుల్‌ పనిచేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. అంటే దీనర్థం.. మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా తప్పుకోమ్మనా.. లేక తప్పుకోవాలని సంకేతం ఇవ్వడమా.. లేక తప్పుకుంటారని చెప్పడమా అన్నది ఆసక్తికరంగా ఉంది. దిగ్విజయ్ సింగ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడైన వ్యక్తిగానూ.. యూపీ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతగానూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సమీప భవిష్యత్తులో ఏ రోజైనా.. ప్రధాని మన్మోహన్ సింగ్ ను తప్పించి.. ఆ బాధ్యతలు చేపడతారా.. ?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!