చిరంజీవికి ప‌ద‌వి రాష్ట్రంలోనా? కేంద్రం లోనా?


 చిరంజీవికి కేంద్ర మంత్రివ‌ర్గంలో చోటు వ‌చ్చేసింద‌ని, త్వ‌ర‌లోనే మంత్రి గా బాధ్య‌త‌లు తీసుకోబోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ వార్త‌ల‌లో నిజంలేద‌ని తేలిపోయింది. చిరంజీవికి కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వాలంటే ముందు చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. రాజ్య‌స‌భ కి ఎపిలో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు లేక‌పోవ‌డంతో స‌మ‌స్య వ‌స్తోంది.. అందుకే చిరంజీవికి కేంద్రంలో కాకుండా రాష్ట్ర మంత్రివ‌ర్గంలో చోటు ఇస్తే ఎలా ఉంటుంద‌న్న కోణంలో కూడా అధిష్టానం ఆలోచ‌న ఉంద‌న్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పార్టీ అధిష్టానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వరిస్తానని ఆయన చెబుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చిన ముగ్గురు శాసనసభ్యులకు చిరంజీవి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. సి. రామచంద్రయ్య, అనిల్, గంటా శ్రీనివాస రావు పేర్లను ఆయన మంత్రి పదవుల కోసం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కోటగిరి విద్యాధర రావు, వేదవ్యాస్ కూడా అందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ప్రజారాజ్యం నుంచి వచ్చిన ముగ్గురు నాయకులకు డిసిసి పదవులు ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లు తెలుస్తోంది. పిసిసి కార్యవర్గంలో తగిన స్థానాలను కూడా ఆయన తమ వర్గానికి ఆశిస్తున్నారు. త్వరలో వేయబోయే సమన్వయ కమిటీలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తారని అంటున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం ఆ కమిటీని వేయాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుకుంటోంది. ప్రజారాజ్యం పార్టీ విలీన సభ ముగిసిన తర్వాత చిరంజీవి కాంగ్రెసులో క్రియాశీల పాత్ర పోషిస్తారని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!