ఎన్టీఆర్ డబ్బులు గుంజడం అసత్యమే..!

మ‌ల్లెమాల ఎమ్మెస్ రెడ్డి ర‌చించిన ఇదీ నా క‌థ వివాదం మెల్లిగా ముదురుకుంటోంది. ఆయ‌న అందులో వ్రాసిన‌వి అవాస్త‌వాల‌ని అల్రెడీ గుణ‌శేఖ‌ర్ స్పందిస్తే తాజాగా సీనియ‌ర్ నిర్మాత కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే..
‘ఇదీ నా కథ’ పేరుతో సీనియర్ నిర్మాత మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎంఎస్ రెడ్డి) రాసుకున్న ‘ఆత్మకథ’లో దివంగత ఎన్టీ రామారావు, శోభన్‌బాబులపై అసత్య కథనాలు అల్లారంటూ సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ… ఎంఎస్ రెడ్డి కథలోను, తర్వాత ఆయన మీడియాలోను చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవన్నారు. ఎన్టీఆర్‌తో సినిమాలు తీసి లాభాలు గడించిన ఎంఎస్ రెడ్డి, చివరకు ఎన్టీఆర్ చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత అవాకులు చవాకులు పేలడం ఆయన వయసుకు మంచిది కాదన్నారు.
ఇన్నేళ్ల తర్వాత శోభన్‌బాబు ఫలానా కెమెరామెన్ కావాలన్నారని నిందలువేయడం సరికాదన్నారు. ఆ నటులంతా జీవించి ఉన్నప్పుడే పత్రికాముఖంగా ప్రకటిస్తే ఆయన నిజాయితీని అందరూ గుర్తించేవారన్నారు. తాను నిర్మించిన ‘ఆలుమగలు’ సినిమాను వైజాగ్‌లో విడుదల చేయడానికి రూ. 4.25 లక్షలకు అంగీకరించిన ఎంఎస్ రెడ్డి, అతి కష్టంపై రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బు ఇప్పటికీ ఇవ్వలేదని ఆరోపించారు. ‘అందం’ సినిమాకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్షియర్‌ని కూడా మోసం చేసిన విషయం లోకానికి తెలుసన్నారు. ప్రభుత్వం నుంచి పొందిన స్థలంలో మల్లెమాల శబ్దాలయ రికార్డింగ్ స్డూడియో కట్టారన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!