ఎవ‌రు చేయ‌గ‌ల‌రూ.. రాజీనామా..!?



రాజీనామాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. డెడ్ లైన్లు పెడుతూ.. అధిష్టానంపై ఒత్తిడి తెస్తామంటున్న నేతలు.. చివరి అస్త్రంగా రాజీనామాలు ప్రయోగిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఆ పరిస్థితే వస్తే.. ఎవరు ముందు రాజీనామా చేస్తారు.. ఇదే విషయం ఇప్పుడు తెంగాణ కాంగ్రెస్ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓ టీవీ ఛానెల్ లో చర్చలో కూర్చున్న ఇద్దరు కాంగ్రెస్ తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య ఇలాంటి గొడవే స్టార్ట్ అయింది. ముందు ఎంపీలు రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు.. లేదు లేదు ముందు మంత్రలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఎంపీలు పట్టుబట్టారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డిల మధ్య ఇలాంటి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ముందు ఎంపీలు రాజీనామా చేస్తే.. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం పడిపోతుందని.. అలాకాకుండా ఉండేందుకు.. కేంద్రం తెలంగాణకు అనుకూల నిర్ణయం ప్రకటిస్తుందని భరతసింహారెడ్డి చెప్పారు. దీనిపై ఎంపీ గుత్తా అభ్యంతరం తెలిపారు. ముందు రాష్ట్రంలో మంత్రలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. రాష్ట్ర సర్కార్ పడిపోతుందని.. అప్పుడు కేంద్రం దిగొచ్చి.. మరీ తెలంగాణ ఇస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తానికి ఒకే ప్రాంతానికి చెందిన నేతలు.. ఒకే సమస్యపై పోరాడుతున్న నేతలు.. సమస్యపై వాళ్లకున్న చిత్తశుద్దిని ప్రశ్నించాల్సి రావొచ్చు. అలాగని.. వీళ్లిద్దరి వాదనలో తప్పుందనీ చెప్పలేము. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ నేతల రాజీనామా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మరోవైపు రాజీనామాలు కాకుండా.. ముందు దీక్షలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!