మ‌రోసారి దీక్ష త‌ప్ప‌దా..?


అవినీతికి వ్య‌తిరేకంగా లోక్‌పాల్ బిల్లుకోసం అన్నా హ‌జారే చేప‌ట్టిన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష ఎంత సంచ‌ల‌న సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న దీక్ష చేప‌ట్టిన 24 గంట‌ల్లోనే దేశం యావ‌త్తూ ఆయ‌న‌కి మ‌ద్ద‌తు తెలిపి యూపిఏ ప్ర‌భుత్వాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన విష‌యం తెలిసిందే.. దెబ్బ‌కి కేంద్ర‌ప్ర‌భుత్వ దిగివ‌చ్చి అన్నాహ‌జారే కోరిన‌ట్టు లోక్‌పాల్ బిల్లుని పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్ట‌డానికి అంగీక‌రించింది. అయితే ఈ లోక్‌పాల్ బిల్లుకి సంబంధించిన విష‌యంలో అన్నాహ‌జారేకి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య కొన్ని విబేధాలు వ‌చ్చాయి. ఏదో తూతూ మంత్రంగా లోక్‌పాల్ బిల్లుని త‌యారు చేసిన‌ట్టు, ఆ లోక్‌పాల్ లో అన్నాహ‌జారే తోపాటు కొంద‌రు స‌భ్య‌లును నియ‌మించేందుకు చ‌ర్య‌లు రూపొందించ‌కుండా ఆ బిల్లులోని ముఖ్య‌మైన అధికారాల‌ని నీరుకార్చేవిధంగా కేంద్రం చేస్తూండ‌టంతో అన్నాహ‌జారే కి కోప‌మొచ్చింది. తాము చెప్పిన‌ట్టుగా లోక్‌పాల్ బిల్లుని రూపొందించి పార్ల‌మెంటు బిల్లు ప్ర‌వేశ‌పెట్టాల‌ని అన్నాహ‌జారే ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే హ‌జారే చెప్పిన‌ట్టుగా బిల్లు చేస్తే దేశంలోని రాజ‌కీయ‌, వ్యాపార రంగాల‌లో ప్ర‌కంప‌ణ‌లు మొద‌ల‌వుతాయ‌ని, అవినీతి ఎంత‌గా పేరుకుపోయిందో.. దేశ‌ప్ర‌జ‌ల‌కి తెలిసిపోతుంద‌ని, దాని ద్వారా త‌మ ప్ర‌భుత్వానికే ముప్పువాటిల్లే ప్ర‌మాదం ఉంటుంద‌ని భావించిన సోనియాగాంధీ ఈ లోక్‌పాల్ బిల్లులో స‌వ‌రింపుల‌కి స‌సేమిరా అంటోంది.. దాంతో అన్నా హ‌జారే మ‌ళ్లీ దీక్ష‌ని చేప‌ట్టేందుకు రెడీ అవుతున్నారు.. ఈసారి ఆయ‌న దీక్ష‌కి పూనుకుంటే ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డుతుంది.. అందుకే హ‌జారే దీక్ష చేయ‌కుండా, లోక్‌పాల్ బిల్లుతో ప్ర‌భుత్వానికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చేయ‌డానికి సోనియాగాంధీ బృందం తీవ్రంగా ఆలోచిస్తుంది.. మ‌రి.. చివ‌రికి హ‌జారే కోరిన‌ట్టు లోక్‌పాల్ బిల్లు రూపొందుతుందా.. లేక కేంద్ర ప్ర‌భుత్వం లోపాయ‌కారీ త‌నంతో మ‌ళ్లీ హ‌జారే ఆమ‌ర‌ణ దీక్ష చేప‌డ‌తాడా..? ఏం జ‌ర‌గ‌బోతోంది..?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!