ఇండియాకి బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయా..?


రైల్వే శాఖ దేశంలో బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెట్టే విషయంపై తీవ్రంగా పరిశీలన చేస్తోంది. తీవ్రగతి సేవా పేరుతో ఫ్రాన్స్ లో ఉన్న బెల్లెట్ రైల్ తరహాలో ఇవి ఉండబోతున్నాయి. ఫ్రాన్స్ దేశం బుల్లెట్ ట్రైన్లను పెట్టింది పేరు. అక్కడ 5 ప్రధాన రైలు మార్గాల్లో గంటకు 280 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో బెల్లెట్ ట్రైన్స్ నడుస్తుంటాయి. ఇక్కడ వాటిని పరిగణలోకి తీసుకున్న మన రైల్వేశాఖ.. ప్రత్యేకంగా నేషనల్ హైస్పీడ్ రైల్ అథారిటీ పేరుతో ఓ ప్రత్యేక సంస్థనే ఏర్పాటు చేస్తోంది. ఆ సంస్థ దేశంలో బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెట్టే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు. ఆ సర్వే కనుక పూర్తి అనుకూలంగా వస్తే.. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల మధ్య ఈ బుల్లెట్ ట్రైన్ లు పెట్టే అలోచన చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ బుల్లెట్ ట్రైన్ లను ఏర్పాటు చేస్తే.. నగరాలకు వలసలు తగ్గుతాయని.. ఉపగ్రహ పట్టణాల అభివృద్ది.. పెరగడమే కాక దేశ ఆర్థికాభివృద్దికి.. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఆరు గుర్తించిన రూట్లలో ఈ బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెట్టడానికి సాధ్యాసాధ్యాల నివేదిక సమర్పించడానికి గానూ.. 3 విదేశీ కన్సల్టెన్సీలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. మనకున్న సిగ్నలింగ్ వ్యవస్థ తదితర అంశాలను వారు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత దేశంలో బెల్లెట్ ట్రైన్ లను ప్రవేశపెట్టే విషయంపై తదుపరి నిర్ణయం తీసుకుంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!