బ్రెట్ లీ మ్యూజిక్ స్టూడియో ఫ‌ర్ పూర్ పీపుల్‌


త‌న భ‌యంక‌ర‌మై బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ల గుండెల్లో ప‌రుగెత్తించ‌గ‌ల మొన‌గాడు.. ఆస్ట్రేలియా ఆట‌గాడు ఫాస్ట్ బౌల‌ర్ బ్రెట్‌లీ.. మైదానంలో ప్ర‌త్య‌ర్థుల‌ని ఎదుర్కునే స‌మ‌యంలో ఎంత క‌ర్క‌షంగా ఉన్నా అదంతా మైదానం బ‌య‌టే.. క్రికెట్ ప్ర‌పంచంలోనుండి బ‌య‌టికి వ‌చ్చాడంటే.. మ‌న‌సున్న మ‌నిషిగా మారి పోతాడు.. అలాంటి మంచి మ‌న‌సుతోనే ఆలోచించి  మురికివాడలోని చిన్నారుల కోసం ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ముంబయిలో ఓ మ్యూజిక్ స్టూడియోను ప్రారంభించాడు. ఈ మ్యూజిక్ స్టూడియోలో ముంబయి పరిసర ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసించే వారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు ‘నా తొలి పర్యటనలో సంపన్నులను, పేదరికంతో మగ్గిపోతున్న వారినీ చూ శాను. అటువంటి అనుభవం నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని. కేవలం సంపన్నులనే చూసి ఉంటే.. ఈ రోజు ఈ స్టూడియా ఆవిర్భవించేది కాదు’ అని బ్రెట్ లీ ఉద్వేగంగా అన్నాడంటే పేద వారి ప‌ట్ల ఆయ‌న‌కి ఉన్న అభిమానం అర్థ‌మ‌వుతుంది.. తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పేద‌వారికి ఉప‌యోగిస్తే వ‌చ్చే ఆనందం ఎలా ఉంట‌దో బ్రెట్‌లీన‌డిగితే క‌రెక్టుగా చెబుతాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!