బెస్ట్ ఫాద‌ర్ స‌ల్మాన్‌ఖాన్‌..


అదేమిటి..? స‌ల్మాన్ పెళ్ళి కాకుండానే తండ్రి ఎలా అయ్యాడు..? అస‌ల‌త‌ను పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడు..?  పిల్ల‌ల‌ని ఎప్పుడు క‌న్నాడు.. బెస్ట్ ఫాద‌ర‌ని ఎప్పుడ‌నిపించు కున్నాడు..?  పై టైటిల్ చూడ‌గానే మీ మ‌దిలో ట‌క ట‌కా ఈ ప్ర‌శ్న‌లు ఉద‌యించాయి క‌దూ..  అస‌లు విష‌యం ఏమిటంటే… చ‌క్క‌టి తండ్రి అంటే ఎలా ఉండాలి.. అనే టాపిక్‌పై ఓ స‌ర్వే జ‌రిగింది. ఆ సర్వేలో భారత యువతీ యువకులు చక్కటి తండ్రి అంటే సల్మాన్‌లా ఉండాలని కోరుకుంటున్నారని తేలింది. పెద్ద తల, కండలు తిరిగి దేహం, డబ్బు సాయం చేయడంలో ఉదారత వంటి గుణాలు సల్మాన్‌ను వారి మనసులో అలా నిలబెట్టాయని నిర్వాహ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.  దీంతో ఇక యాంగ్రీ యంగ్‌మ్యాన్ పాత్రలు మానేసి గౌరవప్రదమైన తండ్రి పాత్రలు వేసుకోవడం మంచిదేమోనని కొందరు భావిస్తున్నారు. పోలైన మొత్తం ఓట్లలో సల్మాన్‌కు 39 శాతం ఓట్లు, రాహుల్ గాంధీకి 31 శాతం ఓట్లు వచ్చాయట. ఇదే సర్వేలో రణబీర్ కపూర్, యువరాజ్‌సింగ్, విరాట్ కోహ్లీలకు వరుసగా నిలిచినప్పటికీ వారికి 10శాతానికి కాస్త అటు ఇటుగా మాత్రమే వచ్చాయి. వీరి దరిదాపులకు ఎవరూ రాలేదు. అయితే పెళ్లి కాని వారికే యువత మంచి తండ్రుల ఓటు వేయడం విశేషం.  అస‌లే త‌న‌తో న‌టించే ప్ర‌తీ హీరోయిన్‌తో ఎఫైర్ న‌డుపుతాడ‌న్న అప‌ప్ర‌ద ఉన్న స‌ల్మాన్‌ఖాన్‌కి బెస్ట్ తండ్రి గా గుర్తింపు ల‌భించడం నిజంగా ఆశ్చ‌ర్య క‌ర‌మైన విష‌య‌మే క‌దా..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!