రాష్ట్ర డిజిపిగా దినేష్‌రెడ్డి..!
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న దినేష్‌రెడ్డిని రాష్ట్రప్రభుత్వం డిజిపిగా నియ మించింది. ఈయన 1973 బ్యాచ్ ఐ.పి.ఎస్.ఆఫీసర్.
నేడు డిజిపి అరవిందరావు పదవీ విరమణ చేయడంతో నెక్ట్స్ డిజిపి ఎవరా అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే ఎక్కువగా కె.ఆర్.నందన్ పేరు వినిపిస్తుంది. సీనియర్ కేటగిరీలో చూస్తే కె.ఆర్. నందన్ డిజిపిగా అర్హుడు అవుతారు. అయితే ఆయన డి.జి.పి.గా కొనసాగడానికి సుముఖంగా లేనని లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలుస్తోంది.. అయితే రాష్ట్ర ప్రభుత్వం డి.జి.పి. కోసం మరి కొన్ని పేర్తని కూడా పరిశీలిస్తుంది. మొత్తం అయిదు మంది అధికారులని డి.జి.పి. పోస్ట్ కోసం పరిశీలనలో తీసుకుంది. ఇందులో సీనియార్టి ప్రకారం కె.ఆర్. నందన్ తర్వాత గౌతమ్ కుమార్, ఉమేష్‌కుమార్, దినేష్‌రెడ్డి, శివశంకర్ల పేర్తు పరిశీలనలో ఉన్నాయి. అయితే దినేష్‌రెడ్డికి ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటం, ప్రభుత్వ విధేయుడిగా కూడా దినేష్‌రెడ్డి మెదులుతాడన్న నమ్మకం ఉండటంతో ప్రభుత్వం దినేష్రెడ్డిపై మొగ్గు చూపుతుందన్న వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సి.ఎం. రాష్ట్ర డి.జి.పి.గా దినేష్‌రెడ్డిని నియమించారు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి