తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క‌లేనా..?


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పట్లో జరగదా? ఈ విషయమై వివిధ మీడియాలలో వస్తున్న కధనాలను పరిశీలిస్తే, ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇవ్వడం వల్ల వచ్చే కొత్త సమస్యలకు భయపడుతోందని, అనవసరంగా మరో పెద్ద సమస్యను ఆహ్వానించినట్లవుతుందని భావిస్తున్న ట్లు చెబుతున్నారు. అందువల్లనే తెలంగాణ రాష్ట్రానికి బదులుగా ప్రత్యామ్నాయలను ఆలోచిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి. తెలంగాణకు ప్రత్యేకంగా ఒక మండలి ఏర్పాటు చేసి భారీగా కొన్ని వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. అధిష్టానం ప్రముఖులు ఎవరికి వారు ఎదుటివారిపై నెట్టివేసి తప్పుకునే ప్రయత్నంచేస్తున్నట్లు కూడా కనబడుతోంది. ప్రణబ్, చిదంబరంలు చాలా స్పష్టంగా సోనియాగాంధీ నిర్ణయిస్తే తప్ప తామేమీ చేయజాలమని ప్రకటించారు. కాగా సోనియాగాంధీ కూడా తన ఒక్కరిమీదే ఇంత భారం పెడతారా?నేను ఒక్కదానినే ఎలా నిర్ణయం తీసుకుంటానని అన్నట్లు కధనాలు ప్రచారం అవుతున్నాయి.కాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు జూలై ఒకటికి డెడ్ లైన్ పెట్టినట్లు ప్రకటించినా, ఆ విషయాన్ని అదికారికంగా సోనియాగాంధీకి లేదా, అధిష్టానం ప్రముఖులకు ఇంకా తెలియచేయలేదని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాని, నల్లగొండ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డికాని డెడ్ లైన్ పెట్టజాలమని చెబుతున్నారు. అదే సమయంలో విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ ఒక నెల రోజులలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై ఒక నిర్ణయం తీసుకుం టుందని, శ్రీకృష్ణ కమిటీ సిఫారస్ లలోని ఆరో సూత్రం ప్రకారం అది ఉండవచ్చని అంటున్నారు.అసలు శ్రీకృష్ణ కమిటీ సిఫారస్ లనుచెత్త బుట్టలో వేశామనితెలంగాణ ఎమ్.పిలు చెబుతున్నారు. మొత్తం సంక్లిష్టంగా మారిన తెలంగాణ సమస్యను మరో రెండేళ్లవరకు ప్యాకేజీలతో నడిపి, ఆ తర్వాత అప్పటికీ పరిష్కారం కాకపోతే రాష్ట్ర విభజన జరుగుతుందని, ప్రస్తుతానికి ఏకాభిప్రాయ సాధన లేదని చెప్పి తప్పుకోవచ్చని చెబుతున్నారు.మొత్తం పరిస్థితి చూస్తుంటే సోనియాగాంధీ కూడా మొత్తం నెపం తనపై పడకుండా ఉండడానికే తంటాలు పడుతున్నట్లు కనిపిస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!